ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన ముప్పు

Jun 27, 2026 - 10:21
 0  585
ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ.. తప్పిన ముప్పు

తిరుమలగిరి 27 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  నిద్రమత్తులో లారీ డ్రైవర్‌ తన వాహనాన్ని ఓ ఇంటిపైకి తీసుకెళ్లాడు. ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. త్రుటిలో ముప్పు తప్పింది వివరాలకు వెళితే వలిగొండ తోరూర్ 365 జాతీయ రహదారి లో తిరుమలగిరి మండలం జలాల్పురం బస్టాండ్ సమీపంలోని ఆంజనేయ స్వామి గుడి దగ్గర తమిళనాడు రాష్ట్రానికి చెందిన TN 20 BS 0268 లారీ అతివేగంతో దూసుకురావడంతో డబ్బా వెంకన్న ఇంట్లోకి రావడం జరిగింది ప్రమాదవశాత్తు ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు ఇంటి గోడలు, కిరాణ సామగ్రి పూర్తిగా ధ్వంసమైంది. తనకు రెండు లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితుడు తెలిపాడు. లారీ డ్రైవర్ కు తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి