భారీ వర్షం నడుమ విద్యుత్ లైన్మెన్ సేవలు

Jun 27, 2026 - 14:02
 0  82
భారీ వర్షం నడుమ విద్యుత్ లైన్మెన్ సేవలు

బండకొత్తపల్లి గ్రామంలో మెరుపు పిడుగు... 

 దెబ్బతిన్న విద్యుత్ లైన్లను... 

తక్షణమే పునరుద్ధరించిన విద్యుత్ శాఖ సిబ్బందికి సోమన్న కి అభినందనలు ... 

గుండాల 27 జూన్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామంలో గడీ ముందు ఉన్న వేప చెట్టుపై మెరుపు పిడుగు పడటంతో చెట్టు విరిగి విద్యుత్ తీగలపై పడింది. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్వెంటనే విద్యుత్ శాఖ  సోమన్న సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే భారీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా సంఘటన స్థలానికి చేరుకున్న సోమన్న మరియు విద్యుత్ శాఖ సిబ్బంది ప్రమాదాన్ని నివారిస్తూ తెగిపోయిన విద్యుత్ తీగలను మరమ్మతు చేసి, విద్యుత్ సరఫరాను వేగంగా పునరుద్ధరించారు.

ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ అత్యంత అంకితభావంతో సేవలందించిన లైన్‌మన్ సోమన్న గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి