ఇంటి వద్దే తొలి ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీసులు

Jan 22, 2026 - 12:49
Jan 22, 2026 - 12:58
 0  14

తెలంగాణ వార్త సూర్యపేట 22-01-26:

ఇంటి వద్దే తొలి ఎఫ్ఐఆర్ కేసు నమోదు చేసిన సూర్యాపేట జిల్లా నడిగూడెం పోలీసులు

 బాధితుల ఫిర్యాదుపై ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం కార్యాచరణ అమలు చేయడంలో భాగంగా నడిగూడెం పోలీసులు జిల్లాలో మొదటి కేసు నమోదు చేశారుఅని ఎస్పీ నరసింహ ఐపిఎస్  తెలిపారు. నడిగూడెం మండలం తెల్లబెల్లి గ్రామానికి చెందిన వికాళాంగురాలు భూమా రమాదేవి భర్త వేధిస్తున్నాడు, కొడుతున్నాడు అని డయల్ 100 కు ఫోన్ చేయగా సంచారం అందుకున్న నడిగూడెం ఎస్ఐ అజయ్ కుమార్ తన సిబ్బందితో కలిసి బాధితురాలి ఇంటికి వెళ్లి ఫిర్యాదు స్వీకరించి అక్కడే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ కాపీని బాదితురాలికి అందించారు అని తెలిపినారు. ఎఫ్ ఐ ఆర్ డోర్ స్టెప్ కార్యక్రమం ద్వారా మహిళలపై, పిల్లలపై, వృద్దులపై దాడులు, దొంగతనాల, భౌతిక దాడులు, బాల్య వివాహాలు, వేదింపుల వంటి సందర్భాల్లో  బాధితులకు భరోసాగా ఉంటుంది, ఇంటికి వెళ్లి కేసు నమోదు చేయడం జరిగింది అని ఎస్సై అజయ్ కుమార్ .

మొదటి కేసు నమోదు చేసిన నడిగూడెం పోలీసులను ఈ సందర్భంగా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అభినందించారు.

Santosh chakravarthy తెలంగాణ వార్త సీనియర్ జర్నలిస్టు