ఇంటింటి సర్వే పకడ్భందీగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్

Oct 29, 2024 - 21:52
Oct 29, 2024 - 21:53
 0  18
ఇంటింటి సర్వే పకడ్భందీగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్
ఇంటింటి సర్వే పకడ్భందీగా నిర్వహించాలి:జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్

జోగులాంబ గద్వాల 29 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.:- సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగ, రాజకీయ, కుల అంశాలపై సర్వేకు సంబంధించి అన్ని ఏర్పాట్లను పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.ఎం.సంతోష్ అధికారులకు ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఇంటింటి సర్వే కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర సర్వే  నవంబర్ 1 నుండి 3 వ తేదీ వరకు ఎన్యూమరేటర్లు క్షేత్రస్థాయిలో వెళ్లి ఇంటింటి ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని సూచించారు.సర్వే చేపట్టే ముందు గ్రామాలలో ప్రచారాలు నిర్వహించి సర్వే అధికారులకు అవసరమైన సమాచారం అందించే విధంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పట్టా పాస్ పుస్తకాలు సిద్ధంగా ఉంచుకోనేలా ప్రజలకు తెలియజేయాలని అన్నారు. 6వ తేదీ నుండి 18 వ తేదీ వరకు ఇంటింటి సర్వే పక్కాగా చేపట్టి పూర్తిచేయాలని,  సర్వే అనంతరం నవంబర్ 19 నుండి 27వ తేదీ వరకు డేటా ఎంట్రీ పనులను ఎలాంటి తప్పులు లేకుండా చేపట్టి పూర్తి చేయాలని ఆదేశించారు.  ఈ పనులలో జిల్లా స్పెషల్ ఆఫీసర్లు, మండల స్పెషల్ ఆఫీసర్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు భాగస్వాములు కావాలని సూచించారు. ఈరోజు మాస్టర్ ట్రేైనర్ల ద్వారా శిక్షణ పొందుతున్న అధికారులు రేపటి నుండి మండల స్థాయిలో సర్వే నిర్వహించి సిబ్బంది అందరికీ శిక్షణ అందించాలన్నారు.ఈ సందర్బంగా మాస్టర్ ట్రైనర్ లు సర్వే ఏవిధంగా చేయాలన్నది  అందరికి అవగాహనా కల్పించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు తహసీల్దార్లు, ఎం.పి.డి.ఓ లు, ఏపిఓ లు, ఏపిఎం లు తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State