ఇంటర్ పరీక్షలో ఉత్తమ ప్రతిభను చూపించిన విద్యార్థులకు  ప్రశంసా పత్రాలు అందజేసిన

Apr 16, 2026 - 19:51
 0  0
ఇంటర్ పరీక్షలో ఉత్తమ ప్రతిభను చూపించిన విద్యార్థులకు  ప్రశంసా పత్రాలు అందజేసిన
ఇంటర్ పరీక్షలో ఉత్తమ ప్రతిభను చూపించిన విద్యార్థులకు  ప్రశంసా పత్రాలు అందజేసిన

 అలంపూర్ ఎమ్మెల్యే శ్రీ విజయుడు , 

 గద్వాల్ ఎమ్మెల్యే శ్రీ కృష్ణమోహన్ రెడ్డి , 

 జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ , 

జోగులాంబ గద్వాల 16 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల్  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్, గద్వాల్ నియోజకవర్గాల పరిధిలోని  అద్భుత ప్రతిభ కనబరిచిన విద్యార్థులను గద్వాల్ జిల్లా యంత్రాంగం గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అలంపూర్, గద్వాల నియోజకవర్గాల పరిధిలోని వివిధ మండలాలకు చెందిన టాపర్లకు ప్రశంసా పత్రాలను అందజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు  గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి , మరియు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్  చేతుల మీదుగా విద్యార్థులు ఈ గౌరవాన్ని అందుకున్నారు.
తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని ఎమ్మెల్యే శ్రీ విజయుడు ,
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ విద్యార్థులు
ఉన్నత శిఖరాలకు చేరాలని, విద్యార్థులు కేవలం ఇంటర్మీడియట్‌తోనే ఆగకుండా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థాయిలకు ఎదగాలని, మన గ్రామానికి, జిల్లాకు పేరు తీసుకురావాలని,
తల్లిదండ్రుల శ్రమను, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, రూపాయి రూపాయి కూడబెట్టి పిల్లలను చదివిస్తున్నారని, వారి కష్టానికి ప్రతిఫలంగా గొప్ప లక్ష్యాలను చేరుకుని వారి ముఖంలో చిరునవ్వు చూడాలని హితవు పలికారు,విద్యార్థులు క్రమశిక్షణతో చదివి తమ ఆశయాలను నెరవేర్చుకోవాలని, జిల్లా గౌరవాన్ని పెంచాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ మండలాల నుంచి వచ్చిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన విద్యార్థులను చూసి జిల్లా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు ప్రత్యేకంగా అభినందించారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333