ఆశీర్వాద సభకు భారీగా బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణులు

తెలంగాణ వార్త దంతాలపల్లి :- వరంగల్ లో జరిగే మహిళా ఆశీర్వాద సభకు దంతాలపల్లి మండలం నుండి భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు బయలుదేరారు.డోర్నకల్ ఎమ్మెల్యే & ప్రభుత్వ విఫ్ డాక్టర్ రామ్ చందర్ నాయక్ ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రం లోని ఆర్ టిసి బస్టాండ్ నుండి అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసారు. అనంతరం ఇందిరాగాంధీ జయంతి సందర్బంగా కేక్ కట్ చేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తోరూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ & కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుగులోతు బట్టు నాయక్, పిఎసిఎస్ చైర్మన్ సంపేట రాముగౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొమ్మినేని సతీష్, జిల్లా నాయకులు సాదులింగారెడ్డి, మండల నాయకులు పొన్నోటి బాలాజీ, తండా చిన్న రాములు, యువజన నాయకులు ఆవుల సురేష్ యాదవ్,కొడుకుగంటి హరికృష్ణ, ఏరుకొండ వెంకయ్య, కారుపోతుల అనిల్, పోల్ దాస్ యాకయ్య,వెంకట్ రెడ్డి,వాసు,నెమ్మది యాకన్న తో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.