చిన్నారెడ్డిని వరించిన క్యాబినెట్ ర్యాంక్ పదవి
రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా డాక్టర్ జిలేల చిన్నారెడ్డి
వనపర్తి 24 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వనపర్తి. సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ మంత్రి డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డిని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పదవిలో ఆయన క్యాబినెట్ హోదాలో కొనసాగుతారని ఉత్తర్వులో పేర్కొన్నారు. కాగా 2014లో తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలలో టిఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందిన మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఈ పదవిలో కొనసాగారు. రాష్ట్ర ప్రభుత్వం చిన్నారెడ్డిని నియమిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ పదవి రెండు పర్యాయాలు వనపర్తి ప్రాంత నాయకులకు దక్కినట్లు అవుతుంది.