ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా
తిరుమలగిరి 31 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా తిరుమలగిరి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు స్థానిక మండల పరిషత్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల్లో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. మున్సిపల్ నాలుగో వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి సీనియర్ నాయకురాలు దొంతరబోయిన ధనమ్మ తన అనుచరులతో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ మెంబర్ రాపాక సోమేష్, యువజన నాయకులు దొంతర బోయిన గణేష్ తో కలిసి నామినేషన్ పత్రాలను ఎన్నికల అధికారులు అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఫిబ్రవరి 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాలుగో వ వార్డు నుండి తనను వార్డు ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని అన్నారు. వార్డులో గత ప్రభుత్వంలో పేరుకుపోయిన పెండింగ్ సమస్యలన్నీ తనను గెలిపిస్తే తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు సహకారంతో అభివృద్ధి చేస్తానని అన్నారు. అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.