ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా :కందుకూరి శారద నాగార్జున

Feb 7, 2026 - 19:15
 0  427
ఆశీర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా :కందుకూరి శారద నాగార్జున

 తిరుమలగిరి 07 ఫిబ్రవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

తిరుమలగిరి మున్సిపాలిటీ ఎన్నికల్లో 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి శారదనాగార్జున విస్తృత ప్రచారం చేసారు. వార్డు అభివృద్ధి కోసం నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఇంటింటికి వెళ్తూ, తమ పార్టీ గుర్తును చూపిస్తూ ఓటర్లను చైతన్యం చేస్తున్నారు. గత పాలకులు 13వ వార్డును అభివృద్ధి చేయలేదని, కనీస వసతులు కల్పించక పోగా దొంగ జిఎస్టీ ల పేరు చెప్పి అన్యాయంగా దళితుల సొమ్మునుకాజేసారని అన్నారు. 13వ వార్డు కౌన్సిలర్ గా తనని గెలిపిస్తే పెండింగ్ సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేస్తానన్నారు. అంతేకాకుండా త్రాగునీటి కోసం కాలనిలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వార్డు ప్రజలకు మా కుటుంబం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్పార్టీ ఎన్నికల వార్డు ఇంచార్జిలు చింతకుంట్ల వెంకన్న, గుడిపాటి సైదులు, దొంగరి గోవర్ధన్, మల్లేష్, వార్డు ప్రజలు పాల్గొన్నారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి