ఆత్మకూరు మండల వాసికి డాక్టరేట్

Apr 21, 2025 - 19:55
 0  7
ఆత్మకూరు  మండల వాసికి డాక్టరేట్

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ ఆత్మకూరు మండల వాసికి డాక్టరేట్ నశింపేట గ్రామనందు గీతకార్మిక కుటుంబానికి చెందిన గంధం వెంకటయ్య - ఉషమ్మల చిన్నకుమారుడు శేఖర్ కాకతీయ విశ్వవిద్యాలయం వరంగల్ నుండి చరిత్ర విభాగంలో సీనియర్ ప్రొఫెసర్ పోలవరపు హైమావతి గారి పర్యవేక్షణ లో "డిప్లమసి ఆఫ్ ది రాయాస్ ఆఫ్ ది విజయ నగర (1336 -1565 )" అనే అంశంపై పరిశోధనకు డాక్టరేట్ పొందినారు.డాక్టరేట్ మౌఖిక పరీక్ష చరిత్ర విభాగాదిపతి డాక్టర్ రాజ్ కుమార్ , డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సెన్సెస్ ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్, వైవా ఎక్స్టర్నల్ ప్రొఫెసర్ గాజుల దయాకర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ హైదరాబాద్ సూపర్వైజర్ ప్రొఫెసర్ హైమావతి ఆధ్వర్యంలో డాక్టరేట్ ను ప్రకటించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు,గ్రామ పెద్దలు, పలువురు శేఖర్ ను అభినందించారు. సూర్యాపేట లో డిగ్రీ బి ఏ పూర్తి చేసిన అనంతరం కాకతీయ విశ్వవిద్యాలయం లో యం ఎ హిస్టరీ, తదుపరి యం ఫిల్ డిగ్రీ ని ప్రొఫెసర్ పోలవరపు హైమావతి గారి పర్యవేక్షణ లోనే పూర్తి చేశారు. 2012 లో ఎపి సెట్ లో అర్హతను సాధించిన శేఖర్ ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇల్లందు నందు హిస్టరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. డిగ్రీ కళాశాల నందు కళాశాల హరితహారం కన్వీనర్, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ బ్రాంచ్ కన్వీనర్,అకడమిక్ కో ఆర్డినేటర్ గా అదనపు బాధ్యతలను నిర్వహించినారు.ప్రస్తుతం కళాశాల గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఇంచార్జ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పుదుచ్చేరి వరల్డ్ హిస్టరీ కాంగ్రెస్,సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్, డెక్కన్ హిస్టరీ కాంగ్రెస్, ఎపి హిస్టరీ కాంగ్రెస్, తెలంగాణ హిస్టరీ కాంగ్రెస్ లలో సభ్యునిగా కొనసాగుతూ,జాతీయ అంతర్జాతీయ చరిత్ర సదస్సులలో పాల్గొని పలు పరిశోధన పత్రాలు సమర్పించారు. డాక్టరేట్ సాధించిన సందర్భంగా శేఖర్ మాట్లాడుతూ తన పరిశోధనలో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు మిత్రులు తోటి అధ్యాపకులు సహకారం మరువలేనిదని, నసీంపేట లాంటి చిన్న గ్రామం నుండి తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మకమైన కాకతీయ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ సాధించడం చాలా ఆనందంగా ఉందని, నా చిన్ననాటి గురువు మంచికంటి హనుమంతరావు గారికి,తన పరిశోధనలో పూర్తి స్థాయిలో సహకరించిన డీన్ ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ మరియు యూనివర్సిటీ క్యాంపస్ కాలేజ్ ప్రిన్సిపల్ కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ తాళ్లపల్లి మనోహర్ గారికి, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇల్లెందు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ వై చిన్నప్పయ్య గారికి ప్రత్యేకత ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.