పోడు భూముల్లో బోర్లు వేసిన గిరిజన రైతులు, బోర్లలో రాళ్లు వేసిన ఫారెస్ట్ అధికారులు

గిరిజన ఆదివాసి రైతులు ధర్నా
మద్దత్తు ఇచ్చిన డీసీసీ అధ్యక్షులు వీరయ్య
చర్ల ఏప్రిల్ 21
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలో ఉన్న రాళ్ల గూడెం గ్రామంలో రైతులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఆదివాసీ రైతులు పట్టా ఉన్న పొడుభూముల్లో గిరిజన రైతులు బోర్లు వేసినందుకు ఫారెస్ట్ అధికారులు బోర్లులలో రాళ్లు వేసారని ధర్నా నిర్వహించారు.
గిరిజన ఆదివాసీలకు డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే పోదేం వీరయ్య మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు మాట్లాడుతూ గిరిజన ఆదివాసీల రైతులపై ఫారెస్ట్ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. చర్ల మండలం పులి గుండాల గ్రామంలో మీడియం లక్ష్మీ తండ్రి ముత్తయ్య, ఒక సంవత్సరం క్రితం పొలంలో బోరు వేసుకున్నారని. ఐటీడీఏ, కలెక్టర్ఆఫీస్ నుంచి వాటికి పర్మిషన్ తో ఆదివాసి గిరిజన రైతులు పోడు భూముల్లో బోర్లు వేయడం జరిగిందన్నారు. అయితే 19 ఏప్రిల్ 2025న పారెస్ట్ బీట్ ఆఫీసర్ మధ్యాహ్నం దౌర్జన్యంగా బోర్లు పగులగొట్టి రాళ్లు వేశారని అని అన్నారు. ఫారెస్ట్ అధికారులు ఆదివాసి గిరిజన రైతులపై ఈ విధంగా కక్షపూరితంగా ఇబ్బంది పెట్టడం మంచిది కాదన్నారు. పరిమిషన్ ఇచ్చినా కూడా వాటిని పూడ్చిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఆదివాసీ గిరిజన నాయకుడు పులి గుండాల మాజీ సర్పంచ్ సోడి చలపతి మాట్లాడుతూ అర్ వో ఆర్ లో వేసిన బోర్ ని పూడ్చిన అధికారులు, అదే ఆర్ వో ఆర్ లో పట్టా భూమిలోంచి అనేక ఇసుక రాంపుల కొరకు మట్టిని గ్రావెల్ తోలుతుంటే నిమ్మకు నీరెత్తనట్టు ఉంటున్నారని అన్నారు. అదే ఒక ఆదివాసి రైతు చేసుకున్న బోర్లు మటుకు పూడ్చి వేశారని, పూచిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఇకపై ఎటువంటి సంఘటన జరగకుండా చూడాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆదివాసి గిరిజన రైతులు, వివిధ గిరిజన అనుబంధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.