ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిదిలో పోలీస్ భరోసా అవగాహన సదస్సు

Jan 21, 2026 - 22:29
 0  0
ఆత్మకూరు పోలీస్ స్టేషన్ పరిదిలో పోలీస్ భరోసా అవగాహన సదస్సు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  పోలీస్ స్టేషన్ పరిది.. అపరిచితులు ఏదైనా ఇస్తే వద్దు అని చెప్పండి - పోలీస్ భరోసా టీం సిబ్బంది సూర్యాపేట జిల్లా మహిళ భరోసా టీం పోలీస్ సిబ్బంది ఆత్మకూరు మండల పరిధి పాతర్లపహడ్, విజయనగర్ కాలనీ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలు సందర్శించి విద్యార్థులకు రక్షణ చట్టాల గురించి అవగాహన కల్పించారు. అపరిచితులు ఎవరైనా ఏదైనా వస్తువు కానీ, తినిబండారం కానీ ఇస్తే వాటిని ధైర్యంగా తిరస్కరించాలని బాలలకు తెలిపారు. బాలలు అంతా కలిసిమెలిసి ఉండాలని కష్టపడి ఇష్టంగా చదువుకోవాలని సూచించారు. ఎవరైనా దురుద్దేశ పూర్వకంగా తాకుతున్నారు అనేది గ్రహించాలి అని కోరారు, తోటి విద్యార్థులతో స్నేహపూర్వకంగా మెలగాలని గొడవలు పెట్టుకోవద్దని అన్నారు. సమాజంలో మహిళలు విద్యార్థులు బాలల పట్ల రక్షణకు సంబంధించిన చట్టాలు బలోపేతం చేయబడ్డాయని ఎవరైనా వేధింపులకు గురి చేస్తే ధైర్యంగా ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు.