అపరిశుభ్రంగా మారిన పట్టించుకోని అధికారుల.

Jun 19, 2026 - 22:22
 0  1
అపరిశుభ్రంగా మారిన పట్టించుకోని అధికారుల.
అపరిశుభ్రంగా మారిన పట్టించుకోని అధికారుల.
అపరిశుభ్రంగా మారిన పట్టించుకోని అధికారుల.
అపరిశుభ్రంగా మారిన పట్టించుకోని అధికారుల.

జోగులాంబ గద్వాల 19 జూన్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మున్సిపాలిటీ పరిధిలో పరిసరాలు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. రోడ్ల వెంబడి ఎక్కడ బడితే అక్కడ చెత్త కుప్పలు డ్రైనేజీలు నుండి దుర్వాసనతో కంపు కొట్టుతున్న అధికారులు మురికి నీరు తొలగించడం లేదని కాలనీ ప్రజలు వాపోతున్నారు. రాజ్మార్. న్యూ బస్టాండ్. కోర్టు వెనుక బాగాన పరిసరాలు చెత్తచెదారంతో దర్శనమిస్తున్నాయి. న్యూ బస్టాండ్ సమీపంలో డ్రైనేజీ ద్వారా మురికినీరు వెళ్లే మార్గం లేక నిల్వచేరి సమీప దుకాణదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పలుమార్లు అధికారులకు తెలిపిన పట్టించుకోవడంలేదని దుకాణదారులు పేర్కొన్నారు. పరిసరాలపై మున్సిపాలిటీ అధికారులు స్పందించకపోవడంతో అపరిశుభ్రత తీవ్రంగా ఏర్పడుతుంది. పరిశుద్ధ కార్మికులు జనాభాకు తగినంత కార్మికులేనందున పూర్తిస్థాయిలో పరిసరాలు శుభ్రం చెయ్యలేని  దుస్థితి కనబడుతుంది. మున్సిపాలిటీ పరిధిలోని సుమారు 70000 జనాభా 37 వార్డు కౌన్సిలర్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. మున్సిపల్ కమిషనర్ నిర్లక్ష్యమూలంగా అధికారుల పనితీరులో ఎలాంటి మార్పు లేకపోవడం వలన పరిసరాల పరిశుభ్రత పై యధాస్థితి కనబడుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మున్సిపాలిటీ పరిధిలోని పరిసరాలు మురికి నీరు. వ్యర్థ పదార్థాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి పట్టణ ప్రజలు పరిసరాల ప్రభావం వలన ఈగలు దోమలు వ్యాప్తి చెందిందుకు అవకాశం ఉంది కాపాడాల్సిన బాధ్యత అధికారులపైనే ఉన్నది. అని ప్రజల నుంచి విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా మున్సిపల్ సంబంధించిన అధికారులు చర్యలు తీసుకొని వర్షాకాల దృష్టిలో ఉంచుకొని పరిసరాలు శుభ్రంగా ఉంచాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333