అధ్వానంగా గద్వాల ఆర్టీసీ బస్టాండ్
జోగులాంబ గద్వాల 25 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతున్నారు.అవి మాటలకే పరిమితమయ్యాయి.కొన్నేళ్లుగా గద్వాల్ ఆర్టీసీ బస్టాండ్ అధ్వానంగా మారింది.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.ఇక వర్షాకాలం వస్తే చాలు..గద్వాల్ ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణమంతా బురదమయంగా మారుతుంది. అసలు బస్టాండ్ లేదా చేరువ అన్నట్టు తలపిస్తుంది.పలు సార్లు ప్రయాణికులు ఈ బురదలో వాహనాలు జారిపడిన సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి.
దీంతో బస్టాండ్ కు వెళ్లాలంటే ప్రయాణికులు జంకే పరిస్థితులు ఏర్పడ్డాయి.అదేవిధంగా బస్టాండ్ వెనుక చెత్త చెదారం తో కూడిన బురద దీంతో దోమలు ఈగలతో దుర్వాసన రావడంతో ప్రయాణికులు జంకుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ కు రాష్ట్రం నలుమూలల నుంచి బస్సులు వస్తుంటాయి.రోజుకు వేలాది మంది ప్రయాణం చేస్తుంటారు.లక్షల్లో ఆదాయం వస్తున్నా.బస్టాండ్ మాత్రం అభివృద్ధికి నోచుకోవడం లేదు.గద్వాల్ పట్టణం మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత బస్టాండ్ అధ్వాన్న పరిస్థితి రోజురోజుకూ దారుణంగా తయారైంది.జిల్లా అధికారులు, రాజకీయ నేతలు జిల్లాలో ఉన్న ప్రయోజనం ఏం లేదని స్థానికులు మండిపడుతున్నారు.వర్షం వచ్చినప్పుడు బస్టాండ్ ను పరిశీలించడం తప్ప అధికారులు చేసిన అభివృద్ధి మాత్రం శూన్యమని ఆరోపిస్తున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆచరణకు నోచుకోని గద్వాల్ బస్టాండ్ ను అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.నిధులు కేటాయించి మరమ్మత్తులు చేపట్టాలని, ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.