అడ్డగూడూరు బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ చేసిన కె ప్రభాకర్ రెడ్డి

అడ్డగూడూరు 15 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షులు కోమ్మిడి ప్రభాకర్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేశారు.79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఘనంగా పార్టీ కార్యకర్తలు అందరి సమక్షంలో ఈ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాజీ పిఎసిఎస్ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు, మహేష్,నరేష్,రవి,అబ్బులు, తదితరులు పాల్గొన్నారు.