అక్రమ కేసులు పెట్టిన పోలీసులు

నిర్దోషిగా నేషనల్ మరియు ఇంటర్నేషనల్ సోషల్ వర్కర్ మిస్టర్ షేక్ చాంద్ పాషా టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్

Mar 9, 2025 - 19:12
Mar 9, 2025 - 19:29
 0  142
అక్రమ కేసులు పెట్టిన పోలీసులు
అక్రమ కేసులు పెట్టిన పోలీసులు

, 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

నేషనల్ మరియు ఇంటర్నేషనల్ సోషల్ వర్కర్ మిస్టర్ షేక్ చాంద్ పాషా టిపిసిసి ఎన్ఆర్ఐ సెల్ గారిపై రెండు అక్రమ కేసులు పెట్టడం జరిగినది. 6 సంవత్సరాల క్రితం మిస్టర్ మామిడి దుబ్బయ్య గ్రామం బట్టపల్లి పోతారాం గారు సౌదీలో గాయపడి హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉండగా, అతని సురక్షితంగా ఇండియా తెప్పించడం జరిగింది. 12th July 2018 నాడు మామిడి దుబ్బయ్య ఇండియా వచ్చినాడు. మిస్టర్ షేక్ చాంద్ పాషా గారు, మామిడి డబ్బియ్య, అతని భార్య, బిడ్డలతో మరియు ఇతర కుటుంబ సభ్యులతో ఇండియన్ మరియు సౌదీ అధికారులతో స్వంత కర్చులతో బొంబాయి వెళ్లి ఎమిగ్రేషన్ అధికారులను సంప్రదించి న్యాయ సలహాతో బొంబాయి గల్ఫ్ ట్రావెల్ ఏజెన్సీకి షోకేస్ నోటీసులు పంపడంతో వారు స్పందించి సౌదీ కంపెనీ వారితో సాంప్రదించి, శ్రీ మామిడి దుబ్బయ్య ను 12th July 2018 నాడు ఇండియాకు రప్పించడం జరిగినది. షేక్ చాంద్ పాషా గారి చొరవకృషిని ప్రశంసించింది పోయి అతనిపై అప్పటి జగిత్యాల టౌన్ సిఐ రెండు కేసులు వేయడం జరిగినది. చాంద్ పాషా కేసులకు భయపడకుండా ధైర్యంగా ఆరు సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరుగుతూ, 19th Feb 2025 నాడు జిల్లా సెషన్స్ జడ్జి కోర్టులో నిర్దోషిగా ప్రకటింపబడ్డాడు. అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులపై విచారణ జరిపించి, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నమెంట్ కు, రాష్ట్ర ఉన్నత పోలీసు అధికారులకు లేఖలు రాసినట్టు తెలిసింది. చాంద్ పాషా గారిపై అక్రమ కేసులు కొత్తేమీ కాదు. ఇంతకుముందు కూడా అంటే 40 సంవత్సరాలుగా గల్ఫ్ బాధితుల తరపున పోరాడుతూ ఎన్నో అవంతర్గాలు ఎదుర్కొంటూ నేటికీ నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పై తన పోరాటం కొనసాగిస్తున్నాడు. షేక్ చాంద్ పాషా గారికి లోకల్ గా సరియైన సహకారం లభించకపోయిన, జాతీయ మరియు అంతర్జాతీయ మానవత వాదులు అతనికి అండగా ఉంటున్నారు. నాలాంటి సోషల్ వర్కర్లకు, ప్రభుత్వాలకు మరియు దర్యాప్తు సంస్థలకు సహకరించి. షేక్ చాంద్ పాషా పైనే ఇలాంటి అక్రమ కేసులు బనాయిస్తే ఇక మామూలు పౌరుల పరిస్థితి ఏంటి అని చాంద్ పాషా సూటిగా ప్రశ్నిస్తున్నాడు. ఇలాంటి తప్పుడు కేసులు బనయిస్తున్న అధికారులు ఎంతమంది అమాయకులను బలి పశువులను చేశారో విచారణ జరిపించి, ఈ అధికారులు వల్ల మొత్తం పోలీసు వ్యవస్థ బదనాం కాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మరియు ఉన్నత అధికారుల పైన ఉంది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333