సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ, ఎస్సై

Apr 22, 2026 - 17:43
Apr 22, 2026 - 17:43
 0  3
సంఘటన స్థలాన్ని పరిశీలించిన సీఐ, ఎస్సై

జోగులాంబ గద్వాల 22 ఏప్రిల్ 2026తెలంగాణ వార్త ప్రతినిధి:- మండలం పరుమాల గ్రామంలో గుప్త నిధులు త‌వ్వ‌కాలు కలకలం రేపాయి. పరమాల గ్రామ శివారులో ఉన్న శ్రీ రంగస్వామి ఆలయ అవరణలో ఉన్న శివలింగం, వినాయక విగ్రహాల కింద గుర్తు‌ తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు బుధవారం గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.సంఘటన స్థలాన్ని గద్వాల సీఐ టంగుటూరి శ్రీను, గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ లు పరిశీలించారు. గతంలో నుండి జరిగిన తవ్వకాలపై గ్రామస్తుల నుండి వివరాలు సేకరించారు. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ టంగుటూరి శ్రీను తెలిపారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State