అంభారాన్నంటిన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం

Apr 7, 2026 - 20:05
Apr 7, 2026 - 20:33
 0  3

జోగులాంబ గద్వాల 7ఏప్రిల్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, శాసనసభ్యులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  మున్సిపల్ చైర్పర్సన్ జయలక్ష్మి, జిల్లా వైద్య ఆరోగ్య సిబ్బంది మరియు నర్సింగ్ స్టాప్ మెడికల్ కాలేజ్ స్టాఫ్.... . జోగులంబ గద్వాల జిల్లా పాత డీఎంహెచ్ఓ ఆఫీస్ నందు సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవo సందర్బంగా.. జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు ఎమ్మెల్యే,. లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ ,అందరి సమక్షంలో జండా ఊపి ర్యాలీని ప్రారంభించారు... ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్బంగా స్లొగన్స్ తో.. నర్సింగ్ కాలేజ్  విద్యార్థినులు, ఆశా కార్యకర్తలు, జిల్లా వైద్య సిబ్బంది, మెడికల్ స్టూడెంట్స్, అందరు కృష్ణవేణి చౌక్, వరకు ర్యాలీ కొనసాగింది..

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు ఏప్రిల్ 7, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. "ఆరోగ్యమే మహాభాగ్యం" అని మన పెద్దలు ఊరికే అనలేదు. మన దగ్గర ఎంత సంపద ఉన్నా, అనుభవించడానికి ఆరోగ్యం లేకపోతే అది వ్యర్థం. 1948లో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్థాపించబడిన రోజును పురస్కరించుకుని ప్రతి ఏటా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించడం, వ్యాధుల నివారణ మరియు అందరికీ సమానమైన ఆరోగ్య సదుపాయాలు అందేలా చూడటమే ఈ రోజు ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి  మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండటానికి మనం పాటించాల్సిన కొన్ని సమతుల్య ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండాలని ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల శరీరం దృఢంగా ఉంటుందని మన పరిసరాలను మరియు మనల్ని మనం శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అంటువ్యాధుల నుండి రక్షణ పొందవచ్చునని తెలిపారు. కృష్ణవేణి చౌక్ నందు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జె సంధ్య కిరణమై  మాట్లాడుతూ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా చాలా ముఖ్యమని ఒత్తిడిని తగ్గించుకుని సంతోషంగా ఉండాలని మహాత్మా గాంధీ గారు అన్నట్లు, "బంగారం మరియు వెండి నాణేల కంటే ఆరోగ్యమే నిజమైన సంపద". కాబట్టి, ఈ రోజున మనమందరం ఒక ప్రతిజ్ఞ చేద్దాం—ఆరోగ్యకరమైన అలవాట్లను పాటిద్దాం మరియు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములవుదాం. అని కలెక్టర్  శాసనసభ్యులు ఎమ్మెల్యే  అందరూ అధికారులతో సందర్భంగా ర్యాలీకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా  ధన్యవాదాలు.తెలిపారు

ముఖ్యమైన అంశాలు 
ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7.
నిర్వహణ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO).
2025 ప్రాధాన్యత: తల్లి మరియు నవజాత శిశువు ఆరోగ్యంపై WHO ప్రత్యేక దృష్టి సారించింది.
లక్ష్యం: 2030 నాటికి 'అందరికీ ఆరోగ్యం' (Health for All) సాధించడం. 

 ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు.. కౌన్సిలర్ మంజులరాణి,డిప్యూటీ డిఎంహెచ్వో, డాక్టర్ సిద్ధప్ప ,జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు, డాక్టర్ జి రాజు, డాక్టర్ మొహమ్మద్ అజ్గర్ అలీ, డాక్టర్ ప్రసూనారాణి, డిపిహెచ్ఎన్ఓ వరలక్ష్మి, హెల్త్ ఎడ్యుకేటర్ మధుసూదన్ రెడ్డి, జిల్లా ఎన్సీడీ కోఆర్డినేటర్లు శ్యాంసుందర్, హీర్యా నాయక్, ఎంసీఏ సెంటర్ మరియు అర్బన్ హెల్త్ సెంటర్ సిబ్బంది... ఏళ్లు ఆశా కార్యకర్తలు అందరూ ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333