అంధకారంలో 60 ఫీట్ల రోడ్డు 

Dec 26, 2024 - 22:23
 0  5
అంధకారంలో 60 ఫీట్ల రోడ్డు 
అంధకారంలో 60 ఫీట్ల రోడ్డు 

సూర్యాపేట జిల్లా :..... 

ఆ చీకట్లో ఆ సీసీ కెమెరాలు పని చేస్తున్నాయా లేదా..??

రోడ్డు ప్రమాదాలు జరిగితే బాధ్యులు ఎవరు..??

రోజుల తరబడి వెలగని వీధిలైట్లు పట్టించుకునే నాధుడే కరువు

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డును అంధకారం చుట్టుముట్టింది. గత నెలల రోజులుగా వీధిలైట్లు వెలగక రోడ్డంతా అంధకారంగా మారి వాహనాలు ఎటు వస్తున్నాయో ఎటు వెళుతున్నాయో కని పించక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాధుడు కరువయ్యాడు. ఈ రహదారిపై అధిక మొత్తంలో పాఠశాలలు కళాశాలలు ఉండడంతో రద్దీ ఎక్కువగా ఉంటుంది. అంతే కాకుండా రాత్రి సమయంలో ఆరున్నర,  8 గంటల ప్రాంతాల్లో కళాశాలలు పాఠశాలలు వదిలిపెట్టడంతో చీకట్లో విద్యార్థులు ఎటు వెళ్లాలో తెలియక అవస్థలు పడుతున్నారు. అప్పుడప్పుడే సైకిల్ తొక్కుకుంటూ పాఠశాలలో కళాశాలలో నుంచి వెళ్లే విద్యార్థినిలు,  యువతుల పరిస్థితి దారుణంగా ఉంది. సైకిల్ ఉన్నప్పటికీ చీకట్లో ఎదురుగా వచ్చే వారు కనిపించక నడిపించుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఇకపోతే పోలీసులు ఇటీవల లాంఛనంగా ఈ రహదారిపై పాఠశాలలు కళాశాలల సహకారంతో రోడ్డు మొత్తం సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అసలు కరెంట్ స్తంభాలపై ఉన్న వీధిలైట్లే వెలగక పని చేయనప్పుడు సీసీ కెమెరాలు ఎలా పనిచేస్తాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా ఈ రహదారి వెంట చీకట్లో పాఠశాలలు కళాశాలల నుంచి తమ పిల్లలను తీసుకెళ్లడానికి వచ్చే తల్లిదండ్రులు, ఇంటికి వెళ్లాల్సిన విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి 60 ఫీట్ల రోడ్డును అంధకారం చర నుంచి విడిపించాలని పాఠశాలలు,  కళాశాలల యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333