అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు చోరీ సొమ్ము స్వాధీనం

Dec 11, 2024 - 19:37
Dec 11, 2024 - 20:32
 0  8
అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు  చోరీ సొమ్ము స్వాధీనం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు చోరీ సొమ్ము స్వాధీనం.. ఆత్మకూరు ఎస్.. పలుదొంగతనాలకుపాల్పడుతూ అంతరాష్ట్ర దొంగ బుధవారం ఆత్మకూరు ఎస్ పోలీసులకు పట్టుపడ్డాడు. సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మండల పరిధిలోని నసీంపేట బస్టాప్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న చీవెంల మండలం బండమీది చందుపట్ల కు చెందిన బొందికోళ్ల సైదులు ను బుధవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సైదులు ను విచారణ చేయగా గతంలో ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని మక్త కొత్తగూడెం ఎపూర్, కోటీనాయక్ తండ తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీకి పాల్పడి బంగారు ఆభరణాల తో పాటు నగదు ను అపహరించినట్లు తెలిపారు. అదేవిధంగా ఖమ్మం,నేలకొండపల్లి, ఉమ్మడి నల్లగొండ, నకిరేకల్ చిట్యాల మాఢుగులపల్లి రాచకొండ కమీష్నరేట్ పరిదిలో నీ మీర్ పేట్ ప్రాంతాల్లో పలు దొంగతనాలకు పాల్పడినట్లు తెలిపారు. ఇతని వద్ద ద్విచక్ర వాహనం, మూడున్నర తులాల బంగారు ఆభరణాలు, సుమారు నలుగుతులాల వెండి వస్తువులను స్వాధీనపరుచుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై శ్రీకాంత్ గౌడ్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.