అంగన్వాడి కేంద్రాల్లో పెండింగ్ ఉన్న పనులను సెప్టెంబర్ 10 లోపల పూర్తి చేయాలి

జిల్లా కలెక్టర్

Aug 30, 2024 - 20:21
Aug 30, 2024 - 20:33
 0  38
అంగన్వాడి కేంద్రాల్లో పెండింగ్ ఉన్న పనులను సెప్టెంబర్ 10 లోపల పూర్తి చేయాలి

జోగులాంబ గద్వాల 30 ఆగస్టు 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల:-అంగన్వాడి కేంద్రాల్లో పెండింగ్ ఉన్న పనులను సెప్టెంబర్ 10 లోపల పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ఇంజనీరింగ్ అధికారులకు ఆదేశించారు.శుక్రవారం ఐ.డి.ఓ.సి కాన్ఫరెన్స్ హాలులో అంగన్వాడి భవనాల పనుల పురోగతి గురించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... అంగన్వాడీ కేంద్రాల్లో లైట్లు మంచిగా లేవని, ట్యూబ్ లైట్లు వాడమని ఆయన అన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పెయింటింగ్, టాయిలెట్స్, త్రాగు నీటి సరఫరా కనెక్షన్ గురించి ఎంత వరకు పనులు పూర్తి అయ్యాయని మండలాల వారిగా ఏ ఈ లను అడిగి తెలుసుకున్నారు.నీటి కనెక్షన్స్ గురించి వాటర్ ట్యాంక్ లు పెట్టించాలని వాటికి కావాల్సిన ఖర్చులను అధికారులతో అడిగి తెలుసుకున్నారు. పెయింటింగ్ ఉన్న కేంద్రాలను అప్గ్రేడ్ చేశామని , ఇంకా చేయాల్సినవి ఎన్ని ఉన్నాయో లిస్ట్ అవుట్ చేయమన్నారు. సెప్టెంబర్ 10 లోగా పనులన్నీ పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు, జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, మిషన్ భగీరథ ఈ.ఈ శ్రీధర్ రెడ్డి, ఈ.ఈ బషీర్ అన్ని మండలాల ఏఈలు, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State