సెషన్స్ న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన కలెక్టర్.

జోగులాంబ గద్వాల 3 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల్. కోర్ట్ నందు ప్రధాన జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టిన ఎన్.ప్రేమలత ని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ మర్యాదపూర్వకంగా కలిసారు.ఈ సందర్భంగా కలెక్టర్ ఆమెకు పూల మొక్కను అందజేసి అభినందనలు తెలిపారు. శ్రీమతి ప్రేమలత గతంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రధాన జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తిగా పనిచేశారు.గద్వాల్ జిల్లాలో ఈ పదవిలో ఉన్న కె. కుషా బదిలీ కావడంతో ఆమెను ఈ స్థానానికి నియమించారు. అన్ని కోర్ట్సిబ్బంది తెలియజేశారు.