సినీ నటుడు ప్రకాష్ రాజ్ రామలక్ష్మణులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన

గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కమిటీ

Apr 18, 2026 - 19:27
Apr 18, 2026 - 19:39
 0  7
సినీ నటుడు ప్రకాష్ రాజ్ రామలక్ష్మణులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన
చర్ల మండల కేంద్రంలో హిందూ సంఘాలు సినీనటుడుప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్న చిత్రం
సినీ నటుడు ప్రకాష్ రాజ్ రామలక్ష్మణులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన

సినీ నటుడు ప్రకాష్ రాజ్ రామలక్ష్మణులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర కమిటీ వారు తెలిపారు. 

టెంపుల్ టౌన్ భద్రాచలం 18 ఏప్రిల్ 2026  తెలంగాణ వార్త జిల్లా స్టాపర్ :- హిందూ సాంప్రదాయాలను అవహేళన చేసి మాట్లాడడం ప్రకాష్ రాజ్ కు అలవాటుగా మారిందని, వెంటనే ప్రకాష్ రాజును అరెస్ట్ చేసి జైలుకు పంపాలని బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేశారు. మహా భక్తురాలు భక్త శబరి సీతా రాములకు ఆరగించు నిమిత్తం పండ్లు ఇచ్చినప్పుడు ఆ పండ్లు ఎలా ఉన్నాయో రుచి చూసి ఇచ్చిన పండ్లను కూడా భక్త శబరి భక్తికి ఆనందిస్తూ ఎంగిలి చేసి ఇచ్చిన పండ్లను కూడా శ్రీరాముడు స్వీకరించి భక్తశబరిని అనుగ్రహించారని. భక్త శబరి గిరిజన మహిళ కావడం సీతారాముల పట్ల గిరిజన భక్తులకు ఉన్న భక్తి విశ్వాసాలను తెలియజేస్తోందని, ఇందుకు విరుద్ధంగా సినీ నటుడు ప్రకాష్ రాజ్ రామలక్ష్మణులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం చూస్తుంటే, ప్రకాష్ రాజ్ కు విదేశీ మూటలు అందుతున్నట్లు సందేహించాల్సి వస్తోందని, భారతీయ సాంప్రదాయాలను భక్తి విశ్వాసాలను అపహాస్యం చేసే విధంగా ప్రకటనలు చేస్తున్న ప్రకాష్ రాజును వెంటనే అరెస్ట్ చేసి అతని వెనుక ఉన్న విదేశీ శక్తుల ప్రమేయాన్ని విచారణ జరిగి, ప్రకాష్ రాజుకు కఠిన శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలని గాయత్రీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామాఝల. రవికుమార్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. అలాగే చర్ల మండల కేంద్రంలో హిందూ సాంప్రదాయవాదులు ప్రదర్శన నిర్వహించి ప్రకాష్ రాజ్ దిష్టిబొమ్మను దాహనం చేశారు. సినీ నిర్మాతలు ప్రకాష్ రాజుకు పాత్రలు ఇవ్వద్దని హిందూ సంఘాలు విజ్ఞప్తి చేశాయి.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333