సహజ స్వభావం ... సామాజిక న్యాయం
ప్రకృతి నియమాల ప్రకారం ఉండేదీ సహజ స్వభావం. లేడిని పులి చంపడం ఎంత సహజమో, బలవంతుడు బలహీనుడిని కొట్టటం అంత సహజం. ఈ సహజ స్వభావంకి శారీరక, జీవావరణ నియమాలే పరమావధి. ప్రకృతి నుంచీ సమాజం పరిణామం చెందింది. సమాజ పరిణామం లో భాగం గా మనిషి పెట్టుకొన్న నియమాలు సామాజిక న్యాయాన్ని నిర్దేశిస్తాయి. పరస్పర అంగీకారం, సమానత్వం, హేతు బద్ధమైన వాటా అనేవి సామాజిక న్యాయానికి మూల స్థంభాలు.ఇవి ఆదర్శ లక్ష్యాలు మాత్రమే!
మనం ఉండే వాస్తవ సమాజం లో పాటించబడే న్యాయం ఈ రెండు రకాల న్యాయాల కలగలుపు గా ఉంటుంది. ఎంత పేదవాడైనా, ఎంత గొప్ప పదవి లో ఉన్నవాడిపైన అయినా కోర్టులో కేస్ వేసుకోవచ్చు. ఇది పుస్తకాలలో రూల్. వాస్తవం లో గొప్ప వాడి పై కేస్ వేయాలంటే ఖర్చవుతుంది. లాయర్ డబ్బు అడుగుతాడు. గొప్పవాడు లాయర్ ని తప్పుకోమని ఒత్తిడి తెస్తాడు. పోలీసులు ఫిర్యాదు తీసుకోరు. పైపెచ్చు పదవిలో ఉన్న వాడి ప్రోద్బలం తో పేదవాడి పైనే కేస్ పెట్టొచ్చు. అంటే ఇక్కడ కూడా బలవంతుడిదే రాజ్యం. కాకపోతే నాగరికమైన పద్దతులలో!!!అందుకే ఫ్రాయిడ్ మనిషిని నాజూకు నాగరిక జంతువూ అన్నాడు.
ప్రకృతి ప్రకారం మగ వాడు అసంఖ్యాకం గా ఉత్పత్తి అయ్యే తన వీర్యకణాలని వ్యాప్తి చేసి, తన సంతానాన్ని, తద్వారా జాతిని వృద్ధి చేయటానికి నిర్దేశింపబడినవాడు. తదనుగుణం గా అపరిమితమైన టెస్టోస్టెరాన్ హార్మోన్ కలిగించే అపరిమితమైన లైంగిక వాంఛ కలవాడు.ముఖ్యం గా దృశ్య పరం గా లైంగిక ఉత్తేజం పొందేవారు. స్త్రీ attention పొందటం కోసం ఇతర పురుషులతో పోటీపడే వాడు. దూకుడు స్వభావం ఉండవలసిన వాడు. అతనికి స్త్రీ "దుస్తులతో ప్యాకేజ్ చేయబడిన లైంగికత" గా కనపడుతుంది
ప్రకృతి పరం గా, బయాలజీ పరం గా స్త్రీ అంటే నెలకొక అండం విడుదల అయ్యి, దాన్ని తననీ తన సంతానాన్ని రక్షించగల బలవంతుడిని షార్ట్-లిస్ట్ చేసి అతనికి ఇచ్చే జెండర్. మగాడు తన సీడ్ ఎంత ఎక్కువ మందికి ఇద్దామా అని చూసే జీవి.
ఇక సామాజిక పరమైన లైంగికత ని సంస్కృతి ప్రభావితం చేస్తుంది. సంస్కృతిని కుటుంబ వ్యవస్థ చట్టాలు ప్రభావితం చేస్తాయి. చిన్నప్పటినుంచీ కట్టుబాట్ల తో పెరిగిన మగవాడి కి కుటుంబ సంబంధాల బయట లైంగిక సంబంధాలు ఉన్నాయన్న ఆలోచన రాదు. అంటే, అక్రమ సంబంధాలు అతని విషయం లో ఒక ఇంపోసిబిలిటీ. సాధ్యం కానివి. అవాస్తవాలు. హార్మోన్ ఎంత ఉన్నా, ప్రకృతి శరీరం మీద ఏమి డిమాండ్ చేసినా, అవాస్తవమైన విషయానికి ఆలోచనల లో స్థానం ఉండదు. ఆలోచన అనే ట్రిగ్గర్ లేకుండా లైంగిక వాంఛ ఉనికి లేదు. ఇది పురుష లైంగికత యొక్క సామాజిక కోణం.
అయితే, అధికారం విషయం లో లానే లైంగికత విషయం లో కూడా, వాస్తవం ప్రకృతి న్యాయం, సామాజిక న్యాయాల సమ్మిళితం గా ఉంటుంది. అందుకే మొనాస్టరీ ల లో సన్యాసులు nuns మీద అత్యాచారాలు చేస్తారు, conditioned morality పై సహజ వాంఛల పై చేయి వలన. మగవాడికి ప్రకృతి ఇచ్చిన నైజం, 'అచ్చోసిన ఆంబోతు' లా తిరగటం. టెస్టోస్టిరోన్ ప్రభావం తో స్త్రీలను packaged sesuality in clothes గా చూడటం,ఇతర మగాళ్ల తో పోటీ పడటం. అదే ప్రకృతి నుంచీవచ్చిన సమాజం, సమాజం నుంచీ వచ్చిన కుటుంబం,చట్టం, సంస్కృతి పురుషుడి సహజ లైంగిక గుణాలను అదుపు లో పెట్టటానికి ప్రయత్నిస్తాయి.కానీ కొన్ని సార్లు విఫలమౌతాయి. మొత్తం మీద ప్రకృతి నుంచీ వచ్చిన సహజాత గుణాల తో, ప్రకృతి నుంచే వచ్చిన సామాజిక నియమాలు నిరంతర సంఘర్షణ లో ఉంటాయి. ఇది. కార్ల్ మార్క్ గారి గతి తర్కం లా ఉంది