సమాజ సేవకులు మహంకాళి సోమయ్య పుట్టిన రోజు వేడుకలు
భానుపురి/ సూర్యాపేట టౌన్
సమాజ సేవకులు సూర్యాపేట శ్రీ వాసవి సేవాసమితి జిల్లా సబ్యులు సీనియర్ సిటిజన్ మహంకాళి సోమయ్య పుట్టిన రోజు వేడుక సోమవారం జిల్లా కేంద్రంలోనీ శ్రీ వాసవి సేవాసమితి కార్యాలయం లో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం మాట్లాడుతూ మహంకాళి సోమయ్య సూర్యాపేట సీనియర్ సిటిజన్ లోఎన్నో విశేష సేవలు అందిస్తున్నారని కొనియాడారు.75 సంవత్సరాల వయసులోనూ కూడా నవ యువకుడిగా ఎన్నో సమాజసేవ కార్యక్రమాల్లో తనదైన శైలిలో పాల్గొంటున్నారని కొనియాడారు. శ్రీ వాసవి సమితి ఎల్లప్పుడూ నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు అండగా నిలుస్తుందని, వారి సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు. సేవా సమితి ద్వారా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి సేవాసమితి ప్రధాన కార్యదర్శి దేవరశెట్టి నాగరాజు కోశాధికారి సోమా ప్రవీణ్ కుమార్ ఉపాధ్యక్షులు మిరియాల సుధాకర్ మహంకాళి ప్రణీత్ సభ్యులు శ్రీరంగం రాము, పోలా లక్ష్మీ నారాయణ, తాటిశెట్టి హనుమంత్, చల్లా సత్యనారాయణ (కిరాణ) తదితరులు పాల్గొన్నారు.