సంక్షేమ వసతి గృహాలలో సమస్యలపై నివేదికలు అందించాలి
వేసవి సెలవులలో వసతి గృహాలలో ఉన్న రిపేర్లను పరిష్కరించాలి.
ఇమాంపేట కేజీవిబి స్కూల్ లో ఫ్యాన్ లు, మైనర్ రిపేర్ల కోసం తక్షణమే రూ.50వేలు విడుదల చేసిన జిల్లా కలెక్టర్.
సూర్యాపేట 21 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్ :- సంక్షేమ వసతి గృహాలలో నెలకొన్న సమస్యలపై సత్వరమే నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాల సందర్భంగా సూర్యాపేటలోని కేజీవిబిని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెస్ కమిటీలు సక్రమంగా రిజిస్టర్ మెంటెయిన్ చేయాలని, రోజు వారీగా స్టాక్ వివరాలు రిజిస్టర్ లో నమోదు చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం డైట్, కాస్మొటిక్ చార్జీలను పెంచడం జరిగిందని, మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఆదేశించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న సంక్షేమ వారోత్సవాలలో వసతి గృహాలలో నెలకొన్న సమస్యలతో పాటు అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న వసతి గృహాలలో రిపేర్లను గుర్తించి నివేదికను సిద్ధం చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.. రిపేర్ల కోసం నివేదికను అందించాలని తెలిపారు.గతంలో కంటే ప్రస్తుతం వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రెగ్యులర్ గా మానిటరింగ్ చేస్తున్నామని తెలిపారు. వేసవి సెలవుల నేపథ్యంలో వసతి గృహాలలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. వసతి గృహాలలో రెగ్యులర్ గా పేరెంట్స్, టీచర్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని విద్యార్థుల సమస్యలపై చర్చించుకోవాలని సూచించారు.. ఏవైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే సత్వరమే పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. అనంతరం వంట శాల, స్టోర్ గదులను, లివింగ్ రూమ్ లను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.. విద్యార్థులకు అందిస్తున్న మెనూ పై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కేజీవిబిలో ఫ్యాన్లు, మైనర్ రిపేర్ల కోసం కలెక్టర్ అవైలబుల్ నిధుల నుండి రూ.50వేలు అందించారు. అనంతరం సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి డిబేట్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, ఎంఈఓ శ్రీనివాస్ గౌడ్, ఎస్.ఓ.నారాయణమ్మ, జిసిడిఓ పుల్లమ్మ, తదితరులు పాల్గొన్నారు.