శ్రీ శ్రీ కంఠమహేశ్వర స్వామి సూరమంబా దేవి మాల ధారణ
పెన్ పహాడ్ మండల పరిధిలోని పొట్లపహాడ్ గ్రామంలో నూతనముగా నిర్మించిన శ్రీ కంఠమహేశ్వర స్వామి ,సూర మాంబదేవి నూతన దేవాలయం వేద పండితులు ఇరువంటి రామయ్య, వెంకటరమణ, సత్యనారాయణ పండితులచే ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు దేవాలయంలో కోడిపుంజు, గణపతి, కౌండిన్ మహర్షి ,వనం మైసమ్మ, రేణుక ఎల్లమ్మ, పోతురాజుల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ సందర్భంగా గ్రామములో నియమ నిబంధనలు పాటిస్తూ భక్తి భావము కలిగి ఉండుట కొరకు గౌడ కులస్తులు మాలాధారణ చేసినారు. ఈ సందర్భంగా దేవాలయ కమిటీ చైర్మన్ మేకపోతుల జానయ్య, వైస్ చైర్మన్ అవిరేసి ప్రవీణ్ ఇరువురు మాట్లాడుతూ గ్రామంలో గౌడ కులస్తు లు నూతన గా నిర్మించిన దేవాలయం11 వ, తారీకు నుండి 14వ తారీకు ఆదివారం వరకు గణపతి హోమం, పుణ్య వచనం, గోపూజ, రక్షాబంధనము, దీక్ష ధారణ, యాగశాల ప్రవేశం, సర్వతోభద్ర ,మండల ఆరాధనలు, పంచగవ్య ప్రశాసనం, మొదలగు కార్యక్రమాలను భక్తి భావంతో నియమ నిబంధనలతో జరుపుటకు పొట్లపాడు గ్రామంలో గౌడ కులస్తులు మాలాధారణ చేయడం జరిగిందని వారు తెలిపినారు. నూతన దేవాలయ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు గ్రామ ప్రజలను గౌడ కులస్తులను కోరినారు. ఈ కార్యక్రమంలో పొట్లపహాడ్ గ్రామ పెద్ద గౌడ్ మేకపోతుల రామదాస్, మాజీ ఉపసర్పంచ్ మేకపోతుల వెంకటేశ్వర్లు, దేవాలయ వైస్ చైర్మన్ మేకపోతుల నవీన్, కోశాధికారులు గూడపూరి సైదులు, మేకపోతుల ఎల్ఐసి సైదులు , మాల ధారణ స్వాములు పాల్గొన్నారు.