శ్రీ రామకృష్ణ విద్యాలయంలో సాంప్రదాయంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు.
ఖమ్మం. 31 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సంప్రదాయాలకు నిలయం అయినటువంటి శ్రీ రామకృష్ణ విద్యాలయం లో ప్రతీ సంవత్సరం లాగా నే సామూహిక వరలక్ష్మి వ్రతం రెండు వందలకు పైగా ముత్తైదువలతో ఘనంగా పాఠశాల కమిటీ ఆద్వర్యంలో నిర్వహించినారు . పూజా సామగ్రి , తీర్ధ ప్రసాదాలు అన్నీ పాఠశాల వారే ఏర్పాటు చేసి సంప్రదాయంగా జరిపించారు . శ్రావణ మాసం లోని ఆఖరి శుక్రవారం కావున ముత్తైదువులు అందరూ పెద్ద సంఖ్య లో పాల్గొన్నారు . ఈ కార్యక్రమం లో ముఖ్య వక్త గా శ్రీ కరి స్వర్ణలత వచ్చిన మహిళలకు శ్రావణ శుక్రవారం గురించి , వరలక్ష్మి వ్రత వైభవం గురించి , మన హిందూ సాంప్రదాయాల గురించి తెలియజేశారు . ప్రధానాచార్యా సంతోషా గౌతం మాట్లాడుతూ వచ్చిన మాతలు అందరూ చాలా బాగా ఏర్పాట్లు చేశారు అని సంతోషం గా ఆశీర్వదించారు అని అన్నారు . ఈ కార్యక్రమంలో పాఠశాల విభాగ్ కార్యదర్శి శ్రీ వేమవరపు సుబ్బారావు , కమిటీ సబ్యులు గుంటి అశోక్ , మతాజీలు , పోషకులు మరియు విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు .