శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి.

Oct 7, 2024 - 20:55
Oct 7, 2024 - 23:24
 0  24
శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలి.

శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి* 

 వల్దాస్ పరశురాములు* 

 శివ సాయి డెకరేటర్స్ అండ్ ఈవెంట్స్* 

తెలంగాణ వార్త .07.10.24 సూర్యాపేట జిల్లా ప్రతినిధి

43 వ వార్డులో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు బత్తుల ఝాన్సీ రమేష్ 

శివ సాయి ఫ్లవర్ డెకరేటర్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో వెయ్యి మందికి అన్నదానం 

శ్రీ కనకదుర్గ అమ్మవారి చల్లని చూపు ప్రజలందరిపై ఉండాలని అందరూ సుఖశాంతులతో అష్ట ఐశ్వర్యాలతో తులతూగాలని మున్సిపల్ కోఆప్షన్ సభ్యురాలు బత్తుల ఝాన్సీ రమేష్ అన్నారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 43వ వార్డులో త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కనకదుర్గ దేవి విగ్రహం వద్ద సోమవారం శివ సాయి డెకరేటర్స్ అండ్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో 1000 మందికి ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. త్రిశూల్ యూత్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. శివ సాయి డెకరేటర్స్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో నిర్వాహకులు వల్దాసు పరుశరాములు నాగమణి దంపతులు 1000 మందికి అన్నదానం చేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. దేవి నవరాత్రి ఉత్సవాలను భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరుతూ వార్డు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శివ సాయి ఫ్లవర్ డెకరేటర్స్ అండ్ ఈవెంట్స్ నిర్వాహకులు వల్దాస్ పరశురాములు నాగమణి, ఫణీంద్ర, లిఖిత, జిల్లా బీఆర్ఎస్ నాయకులు బత్తుల రమేష్, త్రిశూల్ యూత్ సభ్యులు నిఖిల్, రాజు, వేణు, రాము, మాధవ్, విక్కీ, లోకేష్, ఉమేష్, మహేష్, ఆకాష్, సాయి తేజ, సోమ ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223