శేషదాసులవారిచే నిర్మితమైన శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో పవమాన హోమం 

Feb 15, 2025 - 18:53
 0  5
శేషదాసులవారిచే నిర్మితమైన శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో పవమాన హోమం 
శేషదాసులవారిచే నిర్మితమైన శ్రీఆంజనేయ స్వామి దేవాలయంలో పవమాన హోమం 

జోగులాంబ గద్వాల 15 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ సమీపంలో గల దేవరగట్టు మార్గంలో శేషదాస వరద శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో శనివారం గద్వాల కు చెందిన న్యాయవాది భీమ్సేన్ రావు ఆధ్వర్యంలో పవమాన హోమం నిర్వహించారు. వేద పండితులు ప్రమోద్, ప్రసన్న, రమేష్, శశాంక దాస్ ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల మధ్య హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా భీమ్సేన్ రావు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి దేవాలయంలో పవమాన హోమం నిర్వహించాలని కొన్ని ఏళ్లుగా భావించిన చేయలేదని ఈరోజు హోమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అర్చకులు రమేష్ చారి మాట్లాడుతూ చింతరేవుల అర్చకులు బీమ సేనాచారి వ్యవసాయ పొలంలో శ్రీ శేషదాసులువారిచే నిర్మితమైన ఆంజనేయస్వామి దేవాలయంలో మొదటిసారిగా పవమాన హోమం నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ధరూరు పట్వారి అయిన శేషదాసులు పెద్ద చింత రావుల ఆంజనేయస్వామి వద్ద తపస్సు చేసి ఆయన అనుజ్ఞతో మల్దకల్ శ్రీ తిమ్మప్ప స్వామిని పూజించారు. ఇక్కడ సమీపంలోని దేవరగట్టుకు వెళ్తున్న సమయంలో ప్రజలు భయపడి ఇక్కడ రాకపోవడం గమనించి స్వామివారు అంగార తో ఆంజనేయస్వామిని ఒక శిలపై ఆకారము వేసి తపోశక్తితో స్వామిని ఆవిర్భవింప చేశారు. దానితో అక్కడ సంచరించే బ్రహ్మ రాక్షసినీ ఆంజనేయ స్వామి తరిమి కొట్టాడని చరిత్ర చెబుతున్నది. శేషదాసులు 41 రోజులపాటు దేవరగట్టు పై మౌనకాష్ట దీక్ష నిర్వహించి స్వామి సాక్షాత్కారం పొందారనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్వారి అరవిందరావు, దీరేంద్ర దాస్, శ్రీకాంత్ జోషి హర్ష, శ్రీప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333