68 లక్షలు తీసుకొని మోసం చేసిన మోర్రి మేకల సత్యనారాయణ బిల్లర్ పై"ప్రెస్ మీట్ నిర్వహించిన కామ కళావతి

May 30, 2026 - 19:05
May 31, 2026 - 03:20
 0  0
68 లక్షలు తీసుకొని మోసం చేసిన మోర్రి మేకల సత్యనారాయణ బిల్లర్ పై"ప్రెస్ మీట్ నిర్వహించిన కామ కళావతి

రూ,68 లక్షలు తీసుకొని మోసం చేసిన మొర్రిమేకల సత్యనారాయణ బిల్డర్ పై  ప్రెస్ మీట్ నిర్వహించిన కామ కళావతి.

ఖమ్మం తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ మే 30 స్తానిక గట్టయ్య సెంటర్ ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం.

ఖమ్మం మే 30 :- ఖమ్మం రూరల్ చిన్న వెంకటగిరి టౌన్ షిప్ నందు ప్లాటు కొనుగోలు చేసే సందర్భములో నేను బిల్డర్ గా చేస్తున్నాను నాపేరు మొర్రినేకల సత్యనారాయణ ఎదులాపురం 12 వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ తరుపున కార్పొరేటీని అని మాకు పరిచయమై 68 లక్షలకి బేరం కుదుర్చుకొని ప్లాట్,బోర్,బిల్డింగ్ అన్ని పనులు పూర్తి చేసి మీకు అప్పచెపుతాం అని నమ్మ బలికి 

 ఎదులాపురం మున్సిపాలిటీ లో చిన్న వెంకటగిరి నందుగల మహాలక్ష్మి టౌన్షిప్ లో కామ కళావతి వైఫ్ అఫ్ కిరణ్ కుమార్ వద్ద మొత్తం డబ్బులు తీసుకొని ఆ ఇంటికి సంబంధించిన డబ్బుల కు ముందుగా కొంత అడ్వాన్స్ గా 5 లక్షలు ముట్టచెప్పి మిగతా డబ్బులకు 2,చెక్కులు ఇచ్చి మేము బ్యాంకు లోన్ తీసుకొని మిగతా 63 లక్షలు చెల్లించి నవంబర్లో గృహ ప్రవేశం అనగా పాలు పొంగించడం జరిగింది.నేను తల్లాడ లో ఉద్యోగం చేసే నిమిత్తం అక్కడ ఉండవలసి రావడం వలన పోయిన నెల ఏప్రియల్ లో ఖమ్మం మేము కొనుగోలు చేసిన ఇంటిలోకి రావడం జరిగింది.ఇంటికి సంబంధించి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయని అతనికి తెలియజేసినప్పటికీ ఏ మాత్రమూ లెక్క చేయకుండా మాపై గొడవకి 10 మందిని తీసుకొని వచ్చి మమ్ములను బెదిరించి మీరు ఏమి చేసుకుంటారో చేసుకోండి అని బదులిస్తూ నేను ఎస్ సి మహిళని అని నన్ను ఇబ్బంధులకు గురిచేస్తూ ఉన్నాడు.మాకు ఈ మధ్యకాలం లో బోరు నుండి నీళ్ళు రావకపోవడం వంటి ఇబ్బందులు ఎదురైతే ఆ విషయం లో కూడా అడిగితే సమాధానం చెప్పకపోవడం జరిగింది.తదుపరి మేమే మోటారు పైకి వేరే వాళ్ళతో తీపిస్తే ఆ బోరు 20 అడుగులు లోతు ఉండటం మాకు ఆచార్యాన్ని కలిగించింది. మినిమం 250 అడుగులు బోటు వేయకుండా ఇదే ఖమ్మం లో ఎక్కడైనా నీళ్ళు వస్తాయా ఆ విషయం తెలిసిన కూడా మమ్ములను మోసం చేసే పరిస్థితిలో ఇబ్బందులు పెట్టాలని ఈ విధంగా గుట్టు చప్పుడు కాకుండా 20 అడుగులు బోరు వేసి మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.ఆ విషయానికి మేము అడగగా మమ్ములను చంపుతామని బెదిరిస్తూ మీ దిక్కొన్న చోట చెప్పు కోమని చెప్పగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయడం జరుగింది.

అయినను మాకు ఏ మాత్రము న్యాయం జరగకపోవడం వలన ఖమ్మం జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఐ ప్రభాకర్ కి చెప్పి అట్టి విషయాన్ని తెలిపి వారి ఆధ్వర్యములో ప్రెస్ మీట్ నిర్వహించడ మైనది.మాకు ఈ బిల్డర్ సత్యనారాయణ వల్ల సుమారు 10 లక్షలు నష్టం జరిగిందని,ఆ డబ్బులు మాకు రావాలని మరల మేము బోరూ వేయించి మోటర్ బిగించకపోతే ఆ ఇంట్లో మేము ఎలా ఉండగలం అని వారు ఆవేదన వెలిబుచ్చారు.అతను వలన మాకు ప్రాణ హాని కూడా ఉందని వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని, మేము నెలకు బ్యాంక్ లో తీసుకున్న లోనూ బాపతు ప్రతి నెల 50,వేలు రూపాయలు ఈ ఎం ఐ లు కడుతున్నామని వారు వాపోయారు.68 లక్షలు ఖర్చుపెట్టి చివరకు చుక్క నీరు లేకుండా ఏ విధంగా మేము ఆ ఇంటిలో ఉండగలం అని వారు ప్రశ్నిస్తున్నారు.కావున ఈ విషయములో మాకు జరిగిన అన్యాయానికి సత్యనారాయణ అను బిల్డర్ పై చట్ట పరంగా చార్టింగ్ కేసు,క్రిమినల్ కేసు పెట్టించి నైనా మాకు మీ మీడియా ద్వారా మాకు న్యాయం చేస్తారని మిమ్ములను ప్రార్థిస్తునాం.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State