సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ చేరిన ఇంటర్ ప్రశ్నా పత్రాలు..

సూర్యపేట 1 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఈనెల ఐదు నుంచి జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాలు రెండు సెట్లు, ఏ మరియు బి శనివారం డిస్టిక్ బల్క్ కేంద్రం నుంచి సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నాయి. ఈ ప్రశ్న పత్రాలను కస్టోడియన్లు బాల్తు శ్రీనివాస్,మేడ నిరంజన్ రెడ్డి,కర్నాటి శ్రీనివాసులు స్వాధీనం చేసుకొని ఆయా 13 సెంటర్లకు సంబంధించిన సీఎస్, డివోల సమక్షంలో స్ట్రాంగ్ రూమ్ లో తేదిల వారిగా భద్రపరిచారు. ప్రశ్న పత్రాలను భద్రపరచుట క్రమాన్ని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి బాలు నాయక్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చాలా జాగ్రత్తగా ప్రశ్నాపత్రాలని భద్రపరచాలన్నారు. క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచాలని తెలిపారు. ఆయా సెంటర్లకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు సరిపడా వచ్చాయా లేదా అనేది ధ్రువీకరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ పి. యాదయ్య, డాక్టర్ మద్దిమడుగు సైదులు, కేఎల్ నరసింహారావు,కృష్ణ, యాదగిరి, శ్రీనివాసులు, పుల్లయ్య, నరసింహారావు, ప్రసాద్,నవీన్ తదితరులు పాల్గొన్నారు.