విప్లవోద్యమ సీనియర్ నాయకులు కామ్రేడ్ ఆరుట్ల వెంకట్ రెడ్డి,ఆరుట్ల శంకర్ రెడ్డి ల స్మారక స్తూపావిష్కరణ బహిరంగ సభను జయప్రదం చేయండి - రైతు -కూలీ సంఘం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ విప్లవోద్యమ సీనియర్ నాయకులు కామ్రేడ్ ఆరుట్ల వెంకట్ రెడ్డి,ఆరుట్ల శంకర్ రెడ్డి ల స్మారక స్తూపావిష్కరణ బహిరంగ సభను జయప్రదం చేయండి* ----( కరపత్రాలు ఆవిష్కరణ ) --- రైతు -కూలీ సంఘం విప్లవోద్యమా సీనియర్ నాయకులు కామ్రేడ్ ఆరుట్ల వెంకట్ రెడ్డి, ఆరుట్ల శంకర్ రెడ్డి ల జ్ఞాపకార్థం రైతు-కూలీ సంఘం ఆధ్వర్యంలో రామన్నగూడెం గ్రామంలో స్మారక స్తూపాన్ని నిర్మించడం జరిగింది. ఈ స్మారక స్తూపావిష్కరణ బహిరంగ సభను మే,18, 2025 న ఆత్మకూరు (ఎస్) మండలం, రామన్నగూడెం గ్రామంలో సాయంత్రం ఐదు గంటల నుండి నిర్వహించడం జరుగుతుంది. ఈ సభకు విప్లవ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రైతు-కూలీ సంఘం రాష్ట్ర నాయకులు పల్స యాదగిరి , PDSU రాష్ట్ర సహాయ కార్యదర్శి బెల్లి నాగరాజు లు పిలుపునిచ్చారు. రామన్నగూడెం గ్రామ సెంటర్ యందు కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కామ్రేడ్ ఆరుట్ల వెంకట్ రెడ్డి,ఆరుట్ల శంకర్ రెడ్డి లు చిన్న వయసులొనే విప్లవ కమ్యూనిస్టు రాజకీయాలను అలవర్చుకుని,ఆనాడు గ్రామాలలో భూస్వామ్య వర్గం కొనసాగిస్తున్న దౌర్జన్యాలు,అరాచకాలను, దొరలు,పటేల్,పట్వారీ,జాగీర్దార్ల దోపిడీని తుదముట్టించడం కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన పోరాటంలో క్రియాశీలక పాత్ర పోషించిన్నారని అన్నారు. వీరిరువురు రామన్నగూడెం గ్రామ సర్పంచ్ గా కొనసాగిన కాలంలో గ్రామ అభివృద్ధికి పాటుపడినారని . నిస్వార్ధ జీవితాన్ని కొనసాగించి ఎందరికో ఆదర్శ వంతంగా నిలిచినారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రజా పోరాటాల్లో ముందుకు సాగుతున్న కాలంలో నిర్బందాలను,జైలు జీవితాలను అనుభవించారని అన్నారు. వీరిరువురూ నమ్ముకున్న విప్లవ రాజకీయాల వైపు చివరి వరకు నిలబడి,ఆచరణత్మాకంగా ఆచరించి చూపారని అన్నారు. కామ్రేడ్ కామ్రేడ్ ఆరుట్ల వెంకటరెడ్డి, కామ్రేడ్ ఆరుట్ల శంకర్ రెడ్డి ల విప్లవ రాజకీయ జీవితం స్ఫూర్తి దాయకమని అన్నారు.వారు అందించిన పోరాట స్పూర్తితో నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. అందులో భాగంగానే (మే,18, 2025) న రామన్నగూడెం గ్రామంలో జరిగే కామ్రేడ్ ఆరుట్ల వెంకటరెడ్డి, కామ్రేడ్ ఆరుట్ల శంకర్ రెడ్డి ల స్మారక స్తూపావిష్కరణ బహిరంగ సభకు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలోPDSU (విజృంభణ)రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లెబోయిన జాని,రైతు-కూలీ సంఘం నాయకులు : బత్తుల గురువయ్య, రాచకొండ మల్లయ్య, నారగాని కృష్ణ, జుజ్జురి సత్యం, మెట్టు పుల్లారెడ్డి, సిలివేరు మల్లయ్య, మున్న వెంకన్న,మాసిరెడ్డి వెంకట్ రెడ్డి,సామా శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ....ఇట్లు... నారగాని కృష్ణ బత్తుల గురువయ్య రైతు-కూలీ సంఘం నాయకులు.