వినాయక విగ్రహాల ఏర్పాటుకు అనుమతి తప్పనిసరి ఎస్సై వి సురేష్
తిరుమలగిరి 06 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మున్సిపాలిటీ,మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో గణపతి మండపాల నిర్వాహకులు తప్పనిసరి ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకోవాలని తిరుమలగిరి సబ్ ఇన్స్పెక్టర్ వి సురేష్ ఓ ప్రకటనలో తెలిపారు. గణేష్ విగ్రహాల ఏర్పాటుకు పోలీసు వారి అనుమతి తప్పనిసరి అని ఉత్సవ కమిటీలు నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని ఇతరులను ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించరాదని తెలియజేశారు.ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు జరుపుకునేలా చూసుకోవాలని అన్నారు. నిమజ్జనాలకు డీ.జేల అనుమతి లేదన్నారు. నిబంధనలో ఉల్లంఘించి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.