వికలాంగుల చట్టాలు పూర్తిస్థాయిలో అమలు చేయండి.
ఐజ మండలం వికలాంగుల అధ్యక్షుడు తాయన్న.
జోగులాంబ గద్వాల 16 అక్టోబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- ఐజ. మండల్ వికలాంగుల అధ్యక్షుడు తాయన్న మాట్లాడుతూ.... ప్రభుత్వం వికలాంగుల చట్టాలు1995 నుండి 2016-91,92, సెక్షన్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి కార్యాలయాలలో ఆయా శాఖ అధికారులకు మరియు ప్రత్యేకంగా పోలీస్ శాఖ వారికి ఈ వికలాంగుల చట్టాలు తెలిసే విధంగా అమలు చేయాలి అన్నారు.అదే విధంగా వికలాంగులసమస్యల పట్ల, ప్రభుత్వం దృష్టి పెట్టాలన్నారు. మొన్న 2024 జూన్ లో జరిగిన డీఎస్సీ లో వికలాంగులకు రోస్టర్ పాయింట్లలో ఆర్థోపెటి క్ వారికి తీవ్ర అన్యాయంజరిగింది
అన్నారు.ఇందులో భాగంగా నాలుగు శాతం రిజర్వేషన్ అంటున్నారు. పేరుకు మాత్రమే కానీ ఆర్తోపెటి క్ వారికి ఏ విభాగాలలో పోస్టులు అందడం లేదని ఆవేదన వ్యక్తం చెందుతున్నారు.. అలాగే మా చట్టాలను పూర్తిస్థాయిలో అమలు చేసి ఆదుకోవాలని ఒక ప్రకటనలోడిమాండ్ చేశారు.