పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ
కలెక్టర్ పిఓ ఆర్డిఓ కు వినతి పత్రం సమర్పించిన న్యూ డెమోక్రసీ నేత ఆవునూరి మధు
*పోడు భూముల సమస్యను పరిష్కరించాలని కోరుతూ కలెక్టర్,పిఓ ఆర్డిఓ కు వినతిపత్రం సమర్పించిన న్యూడెమోక్రసీనేత ఆవునూరి మధు*
జులై 30 చర్ల తెలంగాణ వార్త:- చర్ల మండలం కలివేరు, దుమ్ముగూడెం గౌరారం పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్,ఐటిడిఏ పిఓ ఆర్డీవో భద్రాచలం గారిలకు సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించడం జరిగింది.
అనంతరం ప్రజలను ఉద్దేశించి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ అవునూరీ మధు మాట్లాడుతూ కలివేరు గౌరారం ప్రజలు గత దశాబ్దా కాలాలు పోడుగు సాగు చేసుకుని జీవిస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఫారెస్ట్ వారు వచ్చి ఈ భూమి ఫారెస్ట్ దే ఆని దీంట్లో మొక్కలు నాటుతామని గత మూడు నెలలుగా బెదిరిస్తున్నారు. అనేకసార్లు పిఓకి రేంజర్ కి వినతిపత్రంలు ఇచ్చి ఉన్నాం.పిఓ గతంలో చర్ల రేంజర్ కి రాశారు. 2005 ముందు కొట్టుకున్న భూములకు పట్టాలు ఇవ్వాలని పిసా యాక్ట్ ప్రకారం గ్రామ తీర్మానాలు ఉంటే మీరు అని నిరూపించగలుగుతారా, కెపాసి తీర్మానాలను బయట పెట్టాలని వారన్నారు. ప్రజలు 20,30 సంవత్సరాలుగా సాగు చేసుకుంటుంటే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు బెదిరింపులు ఏంటని వారు ప్రశ్నించారు.తక్షణమే మీ సమస్యను పరిష్కరించే దశలో అధికారులు చొరవ చూపాలని సాగు చేసుకుంటున్న భూముల జోలికి రాకుండా చూడాలని వారన్నారు.
అయినా మళ్లీ ఫారెస్ట్ రేంజర్ మొక్కలేస్తామని బెదిరిస్తూనే ఉన్నారు.దుమ్ముగూడెం మండలం గౌరారం పంచాయతీలోని ప్రజలు పోడు గొట్టుకొని పట్టా భూములు ఉన్న ఫారెస్ట్ వారు ప్రజల్ని భయపృతులు చేసి మొక్కలు వేశారు ప్రజలు వాటిని తీసివేశారు దీనితో హైకోర్టును ఆశ్రయించగా విచారణకు కోరడంతో కలెక్టర్,పి ఓ,ఆర్డిఓ పరిశీలనకు వచ్చారు. అధికార బృందాన్ని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ బృందం ప్రజలు కలిసి అధికారులను కలిశారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఈ క్రమంలో పరిశీలన చేస్తామని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు,చర్ల దుమ్ముగూడెం సభ్ డివిజన్ కార్యదర్శులు సతీష్ నాయకులు బుర్ర సమ్మక్క ఈరప సమ్మక్క లక్ష్మి ఆదిలక్ష్మి సీతక్క చర్ల దుమ్ముగూడెం మండలాల పోడు భూముల ప్రజలు నాయకులు నాయకురాల్లు తదితరులు పాల్గొన్నారు