ఆవుల కొట్లాటల మధ్య లేగల కాళ్లు విరిగినట్లు రాజకీయ పార్టీల పరస్పర ఆరోపణల మధ్య ప్రజలు దగాపడాల్సిందేనా?

కాపలాదారులకు ప్రభువులు భయపడడంలో ఔచిత్యం లేదు.

Aug 13, 2026 - 01:43
 0  0

ఆవుల కొట్లాటల మధ్య లేగల కాళ్లు విరిగినట్లు రాజకీయ పార్టీల పరస్పర ఆరోపణల మధ్య ప్రజలు దగాపడాల్సిందేనా? కాపలాదారులకు ప్రభువులు భయపడడంలో ఔచిత్యం లేదు.

--వడ్డేపల్లి మల్లేశం

ప్రాంతాలకు రాష్ట్రాలకు అతీతంగా  పాలకులు వివిధ రాజకీయ పార్టీలు  సందర్భానుసారంగా  తరచుగా మాట్లాడే  ఒక మాట  ఆదర్శంగా కనపడిన  అంతకుమించిన దగా మోసం  అబద్ధం మరొకటి ఉండదు  ప్రజలను ప్రభువును గా చూడాలని  తాము మాత్రం ప్రజలకు  సేవకులమని  ప్రజా సంపదకు కాపలాదారులమని  తరచుగా  ప్రస్తావిస్తూ ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తుంటారు  కానీ ఆచరణలో ప్రజల పైన  గుర్రం సారీ చేస్తారు పాలకులు రాజకీయ పార్టీల నాయకులు. అందుకే  అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు  పేరుకే వేరు వేరు కానీ అంతర్గత అవగాహనతో  తమ తమ నెలవులు తప్పిన
  తాము ఇదే ప్రస్తావన చేయడాన్ని మనం కల్లారా చూడవచ్చు.  బాహాటంగా విమర్శించుకోవడం  వందల కోట్లాది రూపాయలు  ప్రజాధనాన్ని కొల్లగొట్టినట్లు  ఆరోపించుకోవడం  మాత్రమే కొనసాగుతుంది కానీ విచారణ పేరుతో కాలయాపన చేసి  రెండు పక్షాలు కూడా  తెరచాటు వ్యవహారాలు చేయడాన్ని  ఈ లోగా ఆ అవినీతి కుంభకోణాలను ప్రజలు మరిచిపోవడాన్ని  చూస్తూనే ఉన్నాం అందుకే భారతదేశంలో జరిగిన అన్ని కుంభకోణాలు  మరే దేశంలోనూ జరగలేదని  కుంభకోణ భారతం అన్న  అతిశయోక్తి లేదని సామాజిక రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకరు సంపదను సృష్టించే సంపదను ప్రజలకు పంచుతామని  తాము కేవలం మధ్యవర్తుల మేనని ప్రకటిస్తూ ఉంటే  మరొకరు  మా పోటీ ప్రపంచం తోనేనని  మాట వరసకు మాట్లాడుతున్నారే కానీ సంపద సృష్టించినది లేదు  పంచినది లేదు  అంతెందుకు దశాబ్దాల క్రితమే  నెగురు భూముల పేరుతో నిర్ధారించిన  వాటిని ఇప్పటికీ ఈ దేశంలో ప్రజలకు  బాధ్యతాయుతంగా చిత్తశుద్ధిగా సామాజిక చింతనతో పాలకులు ప్రజలకు  పంపిణీ చేయలేదంటే  వారి మాటలకు చేతలకు ఎంత తేడా ఉందో అర్థం చేసుకోవచ్చు  అందుకే ప్రతిరోజు  కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీల అధినాయకత్వం  విమర్శించుకోవడం  చౌకబారు మాటలతో  ప్రజల ముందు చులకన కావడం  ప్రజలను నమ్మించడానికి మాత్రం అధికార పార్టీ అవినీతిని ఎండగాడుతున్నామని టిఆర్ఎస్ అంటూ ఉంటే  లక్షల కోట్ల అవినీతికి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో పాల్పడిందని  ఎద్దేవా చేస్తూ ఉంటే  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అధినాయకత్వం గత బిఆర్ఎస్ ప్రభుత్వం పైన  పాలకుల పైన లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని  వదిలిపెట్టే ప్రసక్తి లేదని  చౌకబారు మాటలతో సరిపెడితే  ప్రజలు చూస్తూ ఊరుకోవాల్సిందేనా?
    
     లే గల కాళ్లు విరగాల్సిందేనా?  ప్రజల ఓటమికి ప్రత్యామ్నాయం లేదా?

  విమర్శించే రాజకీయ పార్టీలు  భద్రంగానే ఉంటున్నాయి  కానీ ప్రజలు పిచ్చివాళ్లు కావడమే కాదు  ప్రభువుల స్థాయిలో ఉండవలసిన వాళ్లు  యాచకులుగా మారి ఓడిపోతున్నారు  ఈ దుస్థితిని ప్రజానీకం  ఇప్పటికైనా అర్థం చేసుకోకుంటే రాజకీయ పార్టీల  ఉచ్చులో  మరింత బలి పశువులు కావాల్సిందే  ఈ దుస్థితిని  మాయాజాలాన్ని  అవినీతిని  పరస్పర ఆరోపణలతో మభ్యపెట్టడాన్ని  బుద్ధి జీవులు మేధావులు  సవాల్ గా తీసుకోవాలి  ప్రభుత్వాల ప్రతిపక్షాల అవినీతి కుంభకోణ భాగవతాన్ని  సుమోటో గా న్యాయ వ్యవస్థ స్వీకరిస్తే కానీ  వాస్తవాలు బయటికి రావు .సుమారు 10 ఏళ్ల టిఆర్ఎస్ పాలనలో  లక్ష కోట్ల అవినీతికి పాల్పడినారని  కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం  ప్రభుత్వ నేతలు గతంలోనే ఆరోపిస్తే  కాలేశ్వరం ప్రాజెక్టు  టిఆర్ఎస్ కు ఏటీఎం గా మారిందని  కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి  ఎన్నోసార్లు ప్రస్తావించిన విషయం తెలుసు  కానీ  దేశ నాయకత్వంలో ఉన్నటువంటి బిజెపి కానీ  ప్రస్తుతం నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ  టిఆర్ఎస్ పైనే ఎందుకు చర్యలు తీసుకోలేదు అవి మొక్కుబడి విమర్శలేనా  ఈ విమర్శలను ఎలా అర్థం చేసుకోవాలి  ఈ ప్రజా సొమ్ము అంతా కూడా  ఒకటి రెండు కుటుంబాల పాలు కావాల్సిందేనా  చూస్తూ ఊరుకుంటే అంతకుమించిన నేరస్తులు మరొకరు ఉండరు కదా?  అంతేకాదు  రైతుబంధు  పేరుతో  అధికార దుర్వినియోగం  ఆస్తుల విధ్వంసం జరిగిందని  ఫోన్ టాపింగు కారు ఇక రేసింగ్  వంటి అవినీతి అంశాలు  ఇప్పటికీ నిర్ధారణకు రాకపోవడం లో ఔచితే ఏమిటి  అధికారంలోకి రాగానే చర్లపల్లి జైల్లో  వేస్తామన్న మాటకు అర్థం ఏమిటి? బుకాయింపు మాత్రమేనా? నేరం రుజువు కాకపోవడమా?  నేరంలో వాస్తవం ఉన్నా శత్రువుతో స్నేహస్తం సాచడమా?
           ఇచ్చిన   హామీలను గత బియాస్ ప్రభుత్వము అమలు చేయలేదు  ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా హామీల పేరుతో  ప్రజలను వంచించిన  దోస్తులేనని ప్రజలు ప్రజాస్వామిక వాదులు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు
  ఇక రెండున్నర సంవత్సరాలలో కాస్త కాంగ్రెస్ ప్రభుత్వం  లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని ఇస్తా రాజ్యాంగ సంపాదన దోచుకుంటున్నారని  టిఆర్ఎస్ నాయకత్వం ప్రతిరోజు పత్రికా ప్రకటనలు చేస్తూనే ఉంది.  అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా  ఈ ప్రకటనలు చేయడంలోని
  ఔచిత్యం గమ్మత్తుగా ఉంది కదూ  ఆవులు కొట్లాడుకుంటే  వాటికి ఏమీ కాదు కానీ మధ్యలో  బలహీనంగా ఉన్నటువంటి లేక దూడలు మాత్రం
  కాళ్లు కోల్పోతాయి  గాయాల పాలు చివరికి మృత్యువాత పడే ప్రమాదం కూడా లేకపోలేదు  అలాగే ప్రస్తుతం టిఆర్ఎస్ కాంగ్రెస్  తో పాటు ఇటీవల బీజేపీ పార్టీ కూడా  చేస్తున్నటువంటి ఆరోపణల పోరాటం మధ్యలో  ప్రజలు బలి పశువులవుతున్నారు  అవమాన భారంతో కుంచుకుపోతున్నారు .అవినీతి పేరుతో ధర్నా మోసంలో  ప్రజలు తమ సంపదను కోల్పోతున్నారు  ప్రభుల స్థానంలో  ఆత్మగౌరవంతో బతకాల్సినటువంటి  ప్రజలు  బెదిరింపులకు ఆధిపత్యానికి  శిక్షణకు అణచివేతకు  అప్పుల బాధకు  తట్టుకోలేక ఆత్మహత్యల పాలవుతున్న సంఘటనలు కూడా  చోటు చేసుకుంటుంటే  ప్రభుత్వ అధికార పక్షాలు మీ విమర్శలు చేసుకునేది  నిజమా అబద్దమా  నాటకమా లేదా బూటకమా?  పెట్టుబడుదారులు కార్పొరేట్ శక్తులు భూస్వామి వర్గం పక్షాన ప్రతి ప్రభుత్వం కూడా  కొనసాగుతూ  ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ  ప్రజల ఉపాధి మార్గాలకు గండి కొడుతూ  కొనుగోలు శక్తిని గణనీయంగా తగ్గించి  అప్పుల పాలవుతూ ఆత్మహత్యలకు బలవుతూ ఉంటే  అధికారం కాన్వాయిలు  సభలు సమావేశాలు  అవినీతి  లంచగొండితనంతో  పాలన కొనసాగుతూ ఉంటే  అందులో అధికార యంత్రాంగం కూడా పాల్గొనడం  ప్రభుత్వాలు చూసి చూడనట్టు వ్యవహరించడం  మధ్యలో బలి పశువులవుతున్నది సాధారణ ప్రజలే కదా కాళ్లు రెక్కలు విరుగోట్టుకున్నట్లే కదా  పేరుకే ప్రభువులు కానీ    దాడిలో అవిటి వాళ్ళు అంగవైకల్యం  కలవాలుగా ప్రజలు మిగిలిపోతున్నారు.

  సామాజిక బాధ్యతను విస్మరిస్తున్నాం 

ఒక నాటకం లాగా  జరుగుతున్నటువంటి పాలన  దేశవ్యాప్తంగా ప్రజలను మభ్యపెట్టే రీతిలో కొనసాగుతూ ఉంటే  అధికారం ముసుగులో ప్రజలను  ప్రశ్నించకుండా  అడ్డుకోవడం రివర్స్ గా మారిన తరుణంలో  పాలక ప్రతిపక్షాలు ఇలాంటి అవినీతికి  ప్రజా మోసానికి పాల్పడుతూ ఉంటే  ప్రజలు ఐక్యం చైతన్యం కాలేకపోతున్నారు  బుద్ధి జీవులు మేధావులను కూడా అణచివేసే కుట్ర మరొకవైపు కొనసాగుతుంది.  జాగరూకులైన ప్రజావళి అవసరమని అంబేద్కర్ చెబితే  ప్రజలను చైతన్యం కాకుండా చూస్తున్నటువంటి తరుణంలో  ప్రజా సంఘాలు మేధావులు బుద్ధి జీవుల  పోరాట ప్రతిఘటన శక్తికి తోడు  న్యాయ వ్యవస్థ సుమోటోగా స్వీకరించడం ద్వారా  రెండు పక్షాలయ మాటల్లోనే అంతరాత్రాన్ని  వాస్తవ అవినీతిని  నెగ్గు తేల్చడానికి నేరస్తులకు  కఠిన శిక్షలను విధించడానికి  కొంత తోడ్పడుతుందని సామాన్య   ప్రజానీకం న్యాయవ్యవస్థ పై విశ్వాసం పెట్టుకుంది  ప్రజా పోరాటం  ద్వారానే హక్కులు రక్షించబడతాయని సామాజిక వాస్తవం  చారిత్రక సత్యంగా గతంలో  రుజువైనప్పటికీ  ప్రస్తుతం ప్రజలు బలహీనులవుతున్న నేపథ్యంలో  మూడవ  శక్తిగా  బుద్ధి జీవులకు బాసటగా  న్యాయ వ్యవస్థ  జోక్యం చేసుకున్నప్పుడు మాత్రమే  సంపదని కాపాడుకోవడానికి అవినీతి అక్రమాలను అడ్డుకట్ట వేయడానికి  ప్రజా సంపదను నిజంగా ప్రజలకు పంచడానికి ఓ మేరకు ఆస్కారం ఉంటుంది. రాజ్యాంగంలో రాసుకున్నప్పటికీ  సమానత్వం స్వేచ్ఛ స్వాతంత్రం ఇప్పటికీ ఎండమావిదానే మిగిలిపోవడానికి  ప్రస్తుత పరిస్థితి దర్పణం పడుతున్నది.
( ఈ వ్యాసకర్త సామాజిక రాజకీయ విశ్లేషకుడు)

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333