విద్యుత్ ఎస్ ఇ గా బాధ్యతలు చేపట్టిన పి, యాదగిరి
తెలంగాణ విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం
సూర్యాపేట: సూర్యాపేట విద్యుత్ ఎస్ ఇ గా పి, యాదగిరి నూతనంగా సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని విద్యుత్ సర్కిల్ కార్యాలయంలో సోమవారం ఘనంగా సన్మానించి బొకేతో శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యుత్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముత్యం వెంకన్న గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బ్రహ్మానందరావు, కంపెనీ సెక్రటరీ బొబ్బిలి మురళి, జిల్లా గౌరవ అధ్యక్షులు శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు గుండు పరుశరాములు, జిల్లా కార్యదర్శి బెల్లంకొండ భరత్, డివిజన్ అధ్యక్షులు ఉపేందర్, కార్యదర్శి కృష్ణారావు, నాయకులు స్వాతి, హరీష్, తదితరులు పాల్గొన్నారు.