వనవాసి విద్యార్థులకు సైకిల్స్ వితరణ

Jan 5, 2025 - 17:45
 0  5
వనవాసి విద్యార్థులకు సైకిల్స్ వితరణ

చర్ల, జనవరి 5  : అందివచ్చిన అవకాశాలను సద్వినియోగపరుచుకొని ఉన్నత స్దితికి చేరుకోవాలని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయ గౌరవ సలహాదారు, విశ్రాంత ప్రదానోపాద్యాయులు బివిఎస్ఎల్ నరసింహారావు అన్నారు. చర్లకు చెందిన, ప్రస్తుతం హైదరాబాదులో స్దిరపడిన చిప్పా శ్రీనివాస్ - సత్యవాణి దంపతుల కుమారులు మణిదీప్, తేజ్ దీప్ ల జన్మదినం సందర్భంగా వనవాసీ విద్యార్దుల సౌకర్యం రూ. 13 వేల విలువచేసే రెండు హోరో సైకిల్లను అందచేసారు. ఆదివారం వనవాసీ నిలయంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాస్ సోదరుడు చిప్పా నరసింహమూర్తి వీటిని వనవాసీ ప్రచండ ప్రముఖ్ గొంది శోభన్‌బాబు కు అందచేసారు. కార్యక్రమం కు ముఖ్య అతిదిగా హాజరయిన నర్సింహారావు విద్యార్దులను ఉద్దేసించి ప్రసంగించారు. విద్యార్దులు దాతలు అందచేస్తున్న అవకాశాలను సద్వినియోగపరుచుకోవాలన్నారు. క్రమశిక్షణతో చదివి ఉన్నత స్దితికి చేరుకోవాలన్నారు. విద్యార్దులు పడుతున్న అవస్దలను చూసి సైకిల్లను అందచేసిన శ్రీనివాస్ - సత్యవాణి దంపతులను అబినందించారు. గతంలో సైతం వీరు నిలయ విద్యార్దులకు పరుపులను అందచేసారని గుర్తుచేసారు. సేవా భావంతో పేద గిరిజన విద్యార్దులకు ఇటువంటి వితరణలను అందచేస్తూ దాతలు మానవత్వం వాడుకోవడం అబినందనీయమన్నారు. కార్యక్రమంలో వనవాసీ నిలయ కమిటీ ఉపాధ్యక్షులు జవ్వాది మురళీకృష్ణ, కోశాదికారి వేములపల్లి ప్రవీణ్, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్నకుమారి, విద్యార్దులు పాల్గొన్నారు.