యువత క్రమశిక్షణతో చదువుపై దృష్టి పెట్టాలి :సి.ఐ రాజు వర్మ
చర్ల, జనవరి 05
కొయ్యూరు గ్రామ పంచాయతీ పరిధిలో రేగుంట యూత్ క్రికెట్ నాలుగు మండలాల స్థాయి టోర్నమెంట్ సి ఐ రాజువర్మ రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.సి ఐ రాజువర్మ మాట్లాడుతూ ముందుగా అందరికి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.యువత చెడుమార్గం వైపు వెళ్లకుండా,మద్యం,సెల్ ఫోన్ వంటి వాటికి బానిస అవ్వకుండా చదువుపై ద్రుష్టి పెట్టాలని,చదువు మధ్యలో ఆపొద్దని, ఎంత గొప్ప క్రీడాకారుడు అయినా ఒకరోజు రిటైర్మెంట్ తప్పదని చదువుతో మంచి భవిష్యత్ ఉంటుందని అన్నారు.ఎన్ని సమస్యలు,ఎంత ఒత్తిడి ఉన్నా క్రీడాకారులు ఆత్మహత్య చేసుకోరని, ఎందుకంటే వాళ్ళు ఫైటర్స్ అని ఒక మ్యాచ్ ఓడిపోతే ఎందుకు ఓడిపోయామో తెలుసుకొని ఆ తప్పు సరిదిద్దుకుంటారని అందుకే వారిని ఫైటర్స్ అంటారని తెలిపారు. గెలుపు ఓటములు ఆటలో సహజమే అని క్రమశిక్షణతో ఆడాలని, ఆటలతో పాటుగా చదువుపై శ్రద్ధ పెట్టి, చదివేటప్పుడు సంపాదన గురించి ఆలోచన చేయకుండా చదువు కొనసాగించాలని,చిన్న చిన్న కోరికలు సెల్ ఫోన్,బైక్,మద్యం వంటి వాటికి బానిస అవ్వకుండా ఒక గోల్ పెట్టుకుని సాధించి ఆదర్శంగా నిలవాలని అన్నారు.అనంతరం ఎస్ ఐ నర్సిరెడ్డి మాట్లాడుతూ ఇండియా టీమ్ లో స్థానం కోల్పోయిన పృథ్విషా వయసు ఎంత అని అతనికన్నా చిన్న వయసు నితీష్ కుమార్ రెడ్డి,జైస్వాల్ వంటి యువకులు బోర్డర్ గవాస్కార్ ట్రోఫీ కి సెలెక్ట్ అయ్యి ఇండియా టీమ్ లో ఆడారని,యువత చెడుమార్గంలో వెళ్లకుండా క్రమశిక్షణతో మెలగాలని తగు సూచనలు చేశారు.మొదటి మ్యాచ్ దేవానగరం,పెద్ద ముడిసీలేరు మ్యాచ్ ను సి ఐ రాజువర్మ టాస్ వేసి ప్రారంభించారు. అనంతరం సి ఐ రాజువర్మ,ఎస్ ఐ నర్సిరెడ్డి కొద్దిసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. కొయ్యూరు గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారి షాజహాన్ కుమారులు అక్బర్ షా, రషీద్ కమిటీ సభ్యులకు ఆరువేల రూపాయలు నగదు అందించారు.ఈ కార్యక్రమంలో సి ఐ రాజువర్మ, ఎస్ ఐ నర్సిరెడ్డి,చర్ల పోలీస్ సిబ్బంది,అక్బర్ షా, రషీద్,సరెం. చందర్రావు,నర్సింహా మూర్తి,జోగారావు, కానుక న్యూస్ రిపోర్టర్ చల్లగుండ్ల సతీష్ మరియు రేగుంట యూత్ కమిటీ సభ్యులు మరియు పలువురు క్రీడాభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.