గౌడ హక్కుల సాధనకై గౌడులంతా ఐక్యతగా పోరాడుదాం

Mar 14, 2024 - 19:40
Mar 14, 2024 - 21:30
 0  7
గౌడ హక్కుల సాధనకై గౌడులంతా ఐక్యతగా పోరాడుదాం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్ గౌడలకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలకే మద్దతు ఇవ్వాలి. రాజకీయ పార్టీలు జనాభా తమాషా ప్రకారం గౌడ లకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వకుండా అనగదొక్కాలను చూస్తున్నాయని వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గౌడులకు రాజకీయ ప్రాధాన్యత ఇచ్చిన పార్టీలకు మద్దతు ఇవ్వాలని గౌడ జన హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎలికట్ట విజయకుమార్ పిలుపునిచ్చారు గురువారం మండల పరిధిలోని నెమ్మికల్ లో గౌడ జన హక్కుల పోరాట సమితి జిల్లా జనరల్ బాడీ సమావేశం నిర్వహించగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొంతకాలంగా రాజకీయ పార్టీలు గౌడ లను రాజకీయంగా అనగదొక్కాలను చూస్తున్నాయని, తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా ఒకటి రెండు సీట్లు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయని అన్నారు అన్ని రాజకీయ పార్టీలు జనాభా దామాషా ప్రకారం గౌడలకు సీట్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గౌడులకు ఏ పార్టీ టికెట్ ఇచ్చిన గౌడులను గెలిపించుకోవాలని ఆయన కోరారు . గౌడ్లంతా ఐకమత్యంతో హక్కుల సాధనకు ఉద్యమించాలని మేధావులు రాజకీయ నాయకులు ఈ హక్కుల సాధన కోసం మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు కార్యాల శ్రీనివాస్ గౌడ్ రాష్ట్ర నాయకులు బిక్కి బుచ్చయ్య గౌడ్ చిత్తలూరి నారాయణ గౌడ్, దంతూరి సోమన్న , బూర సైదులు గౌడ్,వెంకటేష్, కప్పల రామ్మూర్తి ,తాడూరు సైదులు, జలగం మల్లేష్, గునిగంటి బిక్షం, మారగాని మారయ్య సతీష్ తిరుమలేష్ , లింగయ్య,తదితరు పాల్గొన్నారు