మాజీమంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ

Jul 24, 2026 - 21:31
 0  4
మాజీమంత్రి కేటీఆర్ జన్మదిన సందర్భంగా పండ్లు పంపిణీ

బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తారక రామారావు (కేటీఆర్)జన్మదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం అడ్డగూడూరు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేశారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాలెంల మల్లిస్వామి మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించి,వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్రనాథ్, మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య,సర్పంచ్‌లు పూజారి సైదులు–వనజ,చుక్క బాబు,దేశబోయిన నాగయ్య,మందుల రేణుక కిరణ్,బొడ్డుగూడెం ఉపసర్పంచ్ సోలీపురం నవీన్, నాయకులు బాలెంల బాబుమహాజన్,గజ్జెలి రవి, గుడెపు పరమేష్,పయ్యావుల రమేష్,పిల్లి గంగయ్య,బోడ వెంకటయ్య,శీలం దావీద్, నాగులపెల్లి బీరప్ప,గుడెపు మహేష్,బండ మచ్చగిరి, కన్నేబోయిన నాగరాజు, కన్నేబోయిన నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333