గ్రూప్ ఇన్సూరెన్స్ 50 వేల నుండి 15 లక్షలు

Jul 16, 2024 - 19:52
Jul 16, 2024 - 22:14
 0  91
గ్రూప్ ఇన్సూరెన్స్ 50 వేల నుండి 15 లక్షలు

లియాఫీ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ ఎస్.బి. శ్రీనివాసచారి.

జోగులాంబ గద్వాల 17 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి: ఎల్ఐసి ఏజెంట్ల గ్రూప్ ఇన్సూరెన్స్ 50 వేల నుండి 15 లక్షల వరకు తీసుకువచ్చిన ఘనత లియాఫీ దేనని లియాఫీ ఆల్ ఇండియా జనరల్ సెక్రెటరీ ఎస్ . బి. శ్రీనివాసచారి అన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మంగళవారము ఎల్ఐసి ఏజెంట్ల సర్వసభ్య సమావేశంలో ఎస్బి శ్రీనివాసచారి మాట్లాడుతూ ప్రతి ఏజెంటు కష్టపడి పని చేస్తే ఫలితం ఉంటుందన్నారు. లియాఫీలో సంవత్సరానికి 500 రూపాయలు కడితే 25 వేల ఇన్సూరెన్స్ ఉంటుందని అది కేవలం లియాఫీలో సభ్యత్వం తీసుకున్న వారికి ఉంటుందని, ఇటువంటి సౌకర్యం ఎక్కడా లేదని ఒక్క లియాఫీలోనే ఉందని ఆయన అన్నారు.

 ఈ సమావేశంలో హైదరాబాద్ డివిజనల్, జోనల్ ఆల్ ఇండియా నాయకులు గద్వాలఆఫీస్ లియాఫీ అధ్యక్షుడు మల్లికార్జున్ గౌడ్, కార్యనిర్వాహక అధ్యక్షుడు రజాక్ ,ప్రధాన కార్యదర్శి బాబా ఉస్మాన్ అలీ,కోశాధికారి  మురళీకృష్ణ,శ్రీనివాసరెడ్డి, ఉప్పెర్ వెంకటేష్,అల్లాపాడు వెంకటేష్, పెద్ద ఇస్మాయిల్, రాఘవ గౌడ్, బి. శ్రీనివాసరెడ్డి, చారి ఏజెంట్లు పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State