రైతు భరోసా ను విడుదల చేసిన ప్రజా ప్రభుత్వం.
రైతు భరోసా ను విడుదల చేసిన ప్రజా ప్రభుత్వం..
రైతును రాజును చేయడమే ప్రజా ప్రభుత్వ ద్యేయం..
ప్రజా ప్రభుత్వం రైతన్న పక్షపాతి..
దేశానికి వెన్నుముక రైతన్నలు..
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి..
తెలంగాణ వార్త మార్చి 24:- మంగపేట మండల కేంద్రం లోనీ వైస్సార్ విగ్రహం వద్ద మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సీఎం గారి చిత్రపఠనికి పాలాభిషేకం చేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన దగ్గర నుండి రైతన్న ను రాజును చేయడమే లక్ష్యం గా ముందుకు వెళ్తున్న మాట వాస్తవం అదేవిధంగా గత పదేళ్ళు రాష్ట్రన్ని పాలించిన BRS పార్టీ రైతన్న కు చేసినది ఏమీ లేదని చేయకపోగా వరి వేస్తే ఉరే అని ఆనాటి ముఖ్యమంత్రి కూడా అనడం బాధాకరం గా భావిస్తూ రేవంతన్న సర్కార్ వచ్చిన తర్వాత ఏకకాలం లో రెండు లక్షల రూపాయలు ఋణమాఫీ చేసిన ఘనత ప్రజా ప్రభుత్వం ది, అదేవిధంగా సన్న వడ్లకు క్వింటా కు 500 రూపాయలు రైతు బోనస్, రైతు భరోసా కింద పెట్టుబడి సాయం, గత ప్రభుత్వం లో 8 నుండి 10 కిలోల కటింగ్ ఉండేది ఇప్పుడు ఎటువంటి కటింగ్ లేకుండా దిగుమతి,రైతులకు రబీ సీజన్ పెట్టుబడి సాయం కింద రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 6000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారికి,రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారికి,వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారికి, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసిన మంగపేట మండల కాంగ్రెస్ కమిటీ ఈ కార్యక్రమం లో..
జిల్లా, నియోజకవర్గం, బ్లాక్ కాంగ్రెస్, మండల,గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు..