114 క్వింటాల PDS రైస్ ను పట్టుకున్న  శాంతి నగర్ పోలీసులు

Apr 27, 2024 - 20:13
 0  18
114 క్వింటాల PDS రైస్ ను పట్టుకున్న  శాంతి నగర్ పోలీసులు
114 క్వింటాల PDS రైస్ ను పట్టుకున్న  శాంతి నగర్ పోలీసులు

జోగులాంబ గద్వాల 27 ఏప్రిల్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వడ్డేపల్లి. శాంతి నగర్ పట్టణము లో ఒక ఇంట్లో అక్రమంగా PDS రైస్ నిల్వ ఉంచినట్లు పోలీస్ లకు నమ్మదగిన సమచారం రాగ శాంతి నగర్ పోలీసులు రైడ్ చేసి 221 సంచులలో 114 క్వింటాల(62 క్వింటాలు రైస్ , 52 క్వింటాలు నూకలు ) PDS రైస్ ను గుర్తించి సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ  రితిరాజ్,IPS  తెలిపారు.

వివరాలు:
శాంతి నగర్ పట్టణము లోని కోయిల దిన్నే రోడ్డు నందు ఒక ఇంట్లో ప్రభుత్వం పేదలకు పంచే PDS బియ్యం ఉన్నట్లు నమ్మదగిన సమచారం రాగా శాంతి నగర్ సి. ఐ శ్రీ కె. ఎస్ రత్నం ఆధ్వర్యంలో ఎస్సై సంతోష్ తన సిబ్బంది తో కలిసి ఆ ఇంటి పై రైడ్ చేసి PDS బియ్యం ను గుర్తించడం జరిగింది. వాటిని పరిశీలించగా 117 సంచులలో 62 క్వింటాలు PDS బియ్యం ను, 104 సంచులలో 52 క్వింటాల PDS బియ్యం నూకలు (మొత్తం 221 సంచులు, 114 క్వింటాలు)ఉన్నట్లు గుర్తించి ఇంటి యజమాని తెలుగు భాస్కర్ s/o లేట్ ఆంజనేయులు, వయస్సు -38 సం "లు, వృత్తి- పిండి గిర్ని R/o శాంతి నగర్ గా గుర్తించి అట్టి  రైస్ ను సీజ్ చేసి నిందితుడి పై శాంతి నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ  తెలిపారు. 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  మాట్లాడుతూ జిల్లా లో PDS రైస్ అక్రమ రవాణా పై పోలీస్ శాఖ పూర్తి స్ధాయిలో నిఘా ఉంచడం జరిగిందని, PDS రైస్ అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం తో పాటు అందుకు కారణమైన వారి పై కఠిన చర్యలు తీసుకోనున్నట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. అలాగే ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం, ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్లారాధని జిల్లా ఎస్పీ శ్రీమతి రితిరాజ్,IPS   తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333