రెండు నెలల్లో ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయాలి.
ఆర్ అండ్ బి కమిషనర్ శివకుమార్ నాయుడు.
జోగులాంబ గద్వాల 1జులై 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ప్రభుత్వం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం భూ సేకరణ ప్రక్రియ వేగవంతంగా చేయాలని ఆర్ అండ్ బి కమిషనర్ శివకుమార్ నాయుడు అన్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష్ షేక్ ఆధ్వర్యంలో ఆయకట్టు సాగు నీళ్లు అందించేందుకు అత్యంత ప్రాధాన్యత ప్రభుత్వం ఇస్తుందని ఆ దిశగా అధికారులు పనిచేయాలని వారు కోరారు. నెట్టెంపాడు గట్టి ఎత్తిపోతల పథకం తో పాటు మల్లమ్మ కుంట రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ సంబంధిత అధికారులతో కలిసి పూర్తి చేయాలని వారు ఆదేశించారు. ఆయా ప్రాజెక్టుల సంబంధించి ప్రీ ప్రైమరీ డిక్లరేషన్ స్థాయిలో వివరాలన్నీ వివరాలన్నీ తెలుసుకున్నారు. తెలుసుకున్నారు అనంతరం వివిధ మండలాల వారి గా ఆయా గ్రామ పరిధిలో చేయాల్సిన భూ సేకరణ పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాస్ షేక్ మాట్లాడుతూ. భూ సేకరణ పై ప్రతివారం అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సమావేశం నిర్వహించుకొని భూ సేకరణ విషయంలో పక్క ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రత్యేక టీములుగా ఏర్పడి రోజువారి లక్ష్యంతో ముందుకు క్షేత్రస్థాయిలో పర్యటించి పనిచేయాలన్నారు. భూసేకరణ వేగవంతం కావడానికి అదనపు సర్వేయర్లను నియమిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో భూ సర్వే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ. సర్వే ఏడి నూకరాజు. ఇరిగేషన్ ఈ ఈ లు సంజయ్ ప్రసాదు శ్రీనివాసులు మండలాల తాసిల్దార్లు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.