రాంగ్ రూట్ ప్రయాణం... ప్రమాదాకారం సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

Apr 2, 2025 - 19:19
 0  1
రాంగ్ రూట్ ప్రయాణం... ప్రమాదాకారం సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం

రహదారి ప్రమాదాల ప్రత్యేక నియంత్రణకు చర్యలు

రహదారి ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరు సహకరించాలని సూర్యపేట పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం సూచించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వాహన చోదకులకు రాంగ్ రూట్ ట్రాఫిక్ నిబంధనలు పలు వాటిపై ఎస్సై ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ మాట్లాడుతూ.. వాహనాల రద్దీ రోజురోజుకూ పెరుగుతున్నందున ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా వాహనదారులు నిబంధనలు పాటించాలని ఎస్‌ఐ తెలిపారు. జాతీయ రహదారిపై రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నందున రాంగ్ రూట్ ప్రయాణలు అసలు చేయవద్దని వాహన చోదకులకు సూచించారు.నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పమన్నారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణకు ప్రతిఒక్కరూ నిబంధనలు పాటించాలని కోరారు.గత పది రోజుల్లో రాంగ్  ప్రయాణం చేసిన 150 మంది వాహన చోదకులకు జరిమానాలు విధించడం జరిగిందని తెలిపారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333