విద్యతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోండి

Apr 2, 2025 - 18:40
Apr 2, 2025 - 19:23
 0  3
విద్యతో భవిష్యత్తుకు పునాదులు వేసుకోండి

ప్రభుత్వ ఉపాద్యాయులు పాపారావు

చర్ల, ఏప్రెల్ 2  : విద్యార్దులు విద్యపై దృష్టిసారించి ఉన్నత చదువులు అభ్యసించడం ద్వారా భవిష్యత్ కు పునాదులు వేసుకోవాలని ప్రభుత్వ ఉపాద్యాయులు తాటి పాపారావు, బేబి రాణి దంపతులు అన్నారు. తమ ప్రదమ కుమార్తె నీహాన్షిక నాలుగవ జన్మదినం సందర్భంగా పాపారావు - బేబిరాణి దంపతులు చర్లలోని వనవాసీ కళ్యాణ పరిషత్ కొమరం భీం విద్యార్ది నిలయంకు 50 కేజీల బియ్యం, విద్యార్దులకు మిఠాయిలు, పండ్లను అందచేసారు. ఈ సందర్భంగా పాపారావు, బేబి రాణి లు విద్యార్దులను ఉద్దేసించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ క్రమ శిక్షణతో విద్యనభ్యసించి తల్లిదండ్రులు కన్నకలలను సార్దకం చేయాలన్నారు. మారుమూల గిరిజన గ్రామాల నుండి వచ్చి వనవాసీలో విద్య నేర్చుకోవడమే కాకుండా ఇతరులకు క్రమ శిక్షణతో ఎలా ఉండాలో నేర్పడం అబినందనీయమన్నారు. చదువుతోనే భవిష్యత్ ఉంటుందని, మన కళ్ల ముందే ఎంతో మంది పేద వర్గాలు ఉన్నత చదువులు చదివి ఆర్దికంగా స్దితిమంతులైన విషయం గమనించాలని కోరారు.‌ వేసవి సెలవులను వృదా చేసుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సమయం వృదా చేయకుండా చదువుపై దృష్టిసారించడం ద్వారా ఉన్నత చదువులు చదివి జీవితంలో రాణించాలని విజ్ఞప్తి చేసారు. కార్యక్రమంలో వనవాసీ ప్రాంత మహిళా సహ ప్రముఖ్ పెద్దాడ ఆశాలత, వనవాసీ జిల్లా కార్యదర్శి కోరం సూర్యనారాయణ, ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు, చర్ల నిలయ కమిటి కార్యదర్శి మల్లాది సుబ్రహ్మణ్యం, ఉపాద్యాయులు జవ్వాది మురళీకృష్ణ, సహ కార్యదర్శి గోగికార్ రాంలక్ష్మణ్, కోశాదికారి వేములపల్లి ప్రవీణ్ బాబు, మహిళా ప్రముఖ్ బందా స్వరూప, నిలయ ప్రముఖ్ గొంది ప్రసన్న, కమిటి సభ్యులు పోలిన రమాదేవి, పాశికంటి శ్రీదేవి పాల్గొన్నారు.