రహదారి భద్రత మనందరి బాధ్యత సిఐ నాగేశ్వరరావు

Apr 16, 2026 - 04:49
 0  126
రహదారి భద్రత మనందరి బాధ్యత సిఐ నాగేశ్వరరావు

  తిరుమలగిరి 16 ఏప్రిల్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  చిన్న వయస్సులోనే ట్రాఫిక్ నియమాలపై అవగాహన పెంపొందితే భవిష్యత్‌లో బాధ్యతాయుత పౌరులుగా ఎదుగుతారని నాగారం మండలం ఇన్‌స్పెక్ట‌ర్ సిహెచ్ నాగేశ్వరరావు అన్నారు. బుధవారం ప్రజా పాలన -ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల కార్యాచరణలో “అరైవ్ – అలైవ్” కార్యక్రమంను బుధవారం తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థుల చే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రహదారి భద్రతపై విస్తృత అవగాహన కల్పించారు. “రహదారుల భద్రత మన అందరి బాధ్యత” అనే నినాదంతో నిర్వహించిన ఈ అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నినాదాల ద్వారా ప్రజల్లో చైతన్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై వెంకట్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు దామర శ్రీనివాస్ హెడ్ కానిస్టేబుల్ వెంకన్న రవీందర్ ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి