యువత మత్తుకు బానిస కావొద్దు పాలకుర్తి శ్రీకాంత్

తిరుమలగిరి 10 మే 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
నాగారం మండలం ఈటూరు గ్రామంలో కళాజాత ప్రదర్శన నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి సూర్యాపేట జిల్లా టీం లీడర్ పాలకుర్తి శ్రీకాంత్ మాట్లాడుతూ యువత గంజాయి డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు మత్తుకు బానిసలు కవద్దు భవిష్యత్తుపై దృష్టి పెట్టాలి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని అని మాట్లాడినారు అదేవిధంగా సన్న బియ్యం పథకం "భూ భారతి" చట్టం పరిసరాల పరిశుభ్రత పాన్ మసాలా గుట్కా నిషేధం పైన ప్రజలకు కళారూపాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక సారధి కళాబృందం సభ్యులు. ఈర్ల సైదులు. గడ్డం ఉదయ్. వెన్నెల నాగరాజు. మాగి శంకర్. పాక ఉపేందర్. మేడిపల్లి వేణు. మద్దిరాల మంజుల. సిరిపంగి రాధ. నెమ్మాది స్రవంతి. పోతరాజు శిరీష. గ్రామ పంచాయతీ సిబ్బంది గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు